- 19.74 శాతం డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ తో వార్షిక వృద్ధి రేటు నమోదు
- మొత్తంగా 1,77,266 యూనిట్లుగా ఉన్న డొమెస్టిక్ సేల్స్
మారుతి సుజుకి అక్టోబరు-2023లో 1,68,047 యూనిట్స్ డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయించి 19.74 శాతం వృద్ధిని నమోదు చేయగా, దీన్ని గత సంవత్సరం అక్టోబరుతో పోల్చి చూడగా గత సంవత్సరం సేల్స్ 1,40,337 యూనిట్లుగా ఉన్నాయి. దీనికి అదనంగా, ఈ కంపెనీ 3,894 యూనిట్ల లైట్ కమర్షియల్ వెహికిల్స్ విక్రయించి, 21,951 యూనిట్లను ఎగుమతి చేసి, 5,325 వెహికిల్స్ ను ఇతర ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మానుఫాక్చరర్(ఓఈఎం) విక్రయించింది.
అలాగే 59, 147 యూనిట్స్ పైగాయుటిలిటీ వెహికిల్స్ మరియు 12,975 పైగా ఈకో వ్యాన్ సేల్స్ కొనసాగించింది. మినీ కార్ సెగ్మెంట్ లో ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో అమ్మకాలు తగ్గుతూ వస్తూ 24,936 యూనిట్ల నుంచి 14,568 యూనిట్లకు పడిపోయాయి. అదే విధంగా ఇదే కాలంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, మరియు వ్యాగన్ ఆర్ లకు సంబంధించి 80,662 యూనిట్లను విక్రయించడంతో 9.47 శాతం అమ్మకాలు పెరిగాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఆ ఆటోమేకర్ నెక్స్ట్-జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ను 2023 జపనీస్ మొబిలిటీ షోలో ఆవిష్కరించింది. ఇది 2024లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండగా, ఈ హ్యచ్ బ్యాక్ బయట మరియు లోపల కొత్త స్పోర్ట్స్ టెక్నాలజీతో రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్