- మొత్తంగా 1,21,028 వాహనాలను మానుఫాక్చరింగ్ చేసిన మారుతి
- 2.96 శాతం మేర తగ్గిన వార్షిక ఉత్పత్తి
ఆటో మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి డిసెంబర్-2023 వరకు 1,21,028 కార్లను ఉత్పత్తి చేసినట్లు వార్షిక వాహనాల ఉత్పత్తి రిపోర్టును ప్రకటించింది. ఇందులో 1,19,518 యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్ మరియు 1,510 యూనిట్ల లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, గత సంవత్సరం 2022లో ఉత్పత్తి చేసిన 1,24,722 యునిట్లతో ఈ సంవత్సరం ఉత్పత్తి చేసిన 1,19,518 యూనిట్లను పోలిస్తే 2.96 మేర వార్షిక ఉత్పత్తి రేటు తగ్గింది.
గత నెలలో ఈ ఆటోమేకర్ 3,259 ఆల్టో, ఎస్-ప్రెస్సో యూనిట్లను మరియు 10,426 యూనిట్ల ఈకో యూనిట్లను మానుఫాక్చరింగ్ చేసింది. ఇంకా బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ మరియు వ్యాగన్ఆర్ యొక్క ప్రొడక్షన్ నంబర్స్ చూస్తే 60,596 యూనిట్లుగా ఉన్నాయి, అలాగే 947 యూనిట్ల సియాజ్ కార్లు ఉన్నాయి. అదే విధంగా డిసెంబర్ 2023లో బ్రెజా, ఎర్టిగా, జిమ్నీ, ఫ్రాంక్స్ మరియు XL6తో కలిపి మొత్తం 44,290 యూనిట్లు ఉత్పత్తి చేయబడ్డాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఇండియాలో 10 లక్షలకు పైగా బ్రెజా కార్లను విక్రయించి మారుతి సుజుకి సరికొత్త మైల్‍స్టోన్‍ని సాధించింది. మొదటిసారిగా 2016లో ఫస్ట్-జనరేషన్ విటారా బ్రెజా సేల్స్ ప్రారంభం కాగా, దాని తర్వాత కేవలం 94 నెలల్లోనే మారుతి సుజుకి ఈ మైల్‍స్టోన్‍ని చేరుకోవడం పెద్ద విశేషమని చెప్పాలి. ప్రస్తుతం, టాటా నెక్సాన్ తో పోటీ పడుతున్న మారుతి సుజుకి బ్రెజాను కస్టమర్లు 4 వేరియంట్లలో 8.29 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్