- ఆల్ఫా, జీటా మరియు డెల్టా వేరియంట్లలో లభిస్తున్న డామినియన్ ఎడిషన్
- మైల్డ్ హైబ్రిడ్, ఫుల్ హైబ్రిడ్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభ్యం
ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి నుంచి మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ గా కొనసాగుతున్న గ్రాండ్ విటారాలో డామినియన్ అనే కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఎడిషన్ కారు లిమిటెడ్ ప్రొడక్షన్ గా అందించబడగా, పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో ఆల్ఫా, జీటా మరియు డెల్టా వేరియంట్లలో లభిస్తుంది. కస్టమర్లను సౌకర్యవంతమైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి మరియు గ్రాండ్ విటారా సేల్స్ మరింత పెంచడానికి డామినియన్ ఎడిషన్ తీసుకువచ్చినట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సేనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
డామినియన్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ యాక్సెసరీస్ కిట్ తో లభిస్తుండగా, రూ.52,999 ధరతో ఆల్ఫా వేరియంట్లో, రూ.49,999 ధరతో జీటా వేరియంట్లో మరియు రూ.48,599 ధరతో డెల్టా వేరియంట్లో దీనిని మీరు పొందవచ్చు. అయితే, డీలర్ చార్జీలతో కలిపి వీటిని అందిస్తుందా ? మరియు లొకేషన్ ని బట్టి ధరలో తేడా ఉంటుందా ? అనే అంశాన్ని మారుతి కంపెనీ వెల్లడించలేదు.
గ్రాండ్ విటారా డామినియన్ ఎడిషన్ లో ఓ రేంజ్ లో కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి అందించిన యాక్సెసరీస్ కిట్లను మీరు పొందుతారు. ఇందులో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ విభాగాలు చాలా వరకు మెరుగయ్యాయి. ఎక్స్‌టీరియర్ అప్ గ్రేడ్లో భాగంగా, ఇందులో మీరు ప్రీమియం కార్ కేర్ కిట్ తో పాటుగా సైడ్ స్టెప్స్, రియర్ స్కిడ్ ప్లేట్స్, బాడీ-సైడ్ మౌల్డింగ్, మరియు డోర్ వైజర్లను పొందుతారు.
మరోవైపు ఇంటీరియర్ పరంగా చూస్తే, డామినియన్ ఎడిషన్లో కారు లోపల మీరు ప్రీమియం డ్యూయల్-టోన్ సీట్ కవర్లు, ఆల్-వెదర్ త్రీ-డీ మ్యాట్లు, ఒక ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, మరియు కారులో మరింత సౌకర్యవంతంగా కూర్చోవడానికి మరియు ప్రీమియం క్యాబిన్ ఎక్స్‌పీరియన్స్ ని పొందడానికి మారుతి మరిన్ని అదనపు అందాలను కూడా జోడించింది. ఒకవేళ మీరు గ్రాండ్ విటారా డామినియన్ ఎడిషన్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు 2024 అక్టోబర్ 31వ తేదీన అందుబాటులోకి వస్తుంది, అప్పుడు మీరు కొనుగోలు చేయవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్