- అందుబాటులో ఉన్న3 వేరియంట్స్
- జూలై 2023లోలాంచ్ అయిన ఇన్‍విక్టో
మారుతి నుంచి వచ్చిన కొత్త ఫ్లాగ్‌షిప్ కారు,ఇన్‍విక్టో, దాని టాప్-స్పెక్ వేరియంట్‌కు అత్యధిక డిమాండ్‌ను కలిగి ఉండడంతో , ఈ వాహనాన్ని ఆటోమేకర్ కొనసాగిస్తుంది. ఇది ఇన్‍విక్టో ఫ్యామిలీలోని టాప్ వెర్షన్ ఆల్ఫా ప్లస్ మోడల్, ప్రస్తుతం దీని ధర రూ. 28.42 లక్షలు ఉండగా మరియు 7 సీట్లతో మాత్రమే అందుబాటులో ఉంది.
టయోటా నుండి ప్రతి నెలా 500-700 యూనిట్ల ప్రీమియం ఎంపివి వెహికిల్స్ సరఫరా చేస్తున్నట్లు మరియు ప్రస్తుతం 8-10 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో మరో 5,000 పెండింగ్ ఆర్డర్లు ఉన్నట్లు ఆటోమేకర్ వెల్లడించింది. దీనికి విరుద్ధంగా, గత రెండు నెలలుగా, టయోటా హైక్రాస్ కి సంబంధించిన టాప్-స్పెక్ ZX మరియు ZX (O) వేరియంట్స్ బుకింగ్‌లను నిలిపివేసింది. దీంతో ఈ మోడల్ పై 15 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది.
జూలై 2023లో లాంచ్ అయిన ఇన్‍విక్టో అనేది మారుతి సుజుకిలో కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి మరియు ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్, ఇది ZX వేరియంట్ తరువాత మొదటి స్థానంలో ఉంది. ఇది ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేయడానికి ఈసీవీటీతో జతచేయబడి 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప