- రెండేళ్ళలోపే ల్యాండ్ మార్కును చేరుకున్న గ్రాండ్ విటారా
- హైబ్రిడ్ మరియు సిఎన్‍జి వేరియంట్లతో ఊపందుకున్న సేల్స్
కేవలం 23 నెలల వ్యవధిలోనే 2 లక్షలకు పైగా గ్రాండ్ విటారా కార్లు అమ్ముడుపోయినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. రికార్డు టైమింగ్ ద్వారా ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీ సేల్స్ మైల్ స్టోన్ ని అందుకుంది. చాలా తక్కువ టైంలో ఫాస్టెస్ట్ సేల్స్ మైల్ స్టోన్ ఇదే అని చెప్పవచ్చు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా సెప్టెంబర్-2022లో మొదటిసారిగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి రాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు అద్బుతమైన సక్సెస్ రేటుతో ముందుకు దూసుకువెళ్తుండడాన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ పాపులారిటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (సిఐఎఎం) ద్వారా వెల్లడైంది ఏంటి అంటే, జూన్-2024 చివరి నాటికి మారుతి సుజుకి కంపెనీ 1,99,550 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను విక్రయించింది. మొదటి లక్ష యూనిట్ల సేల్స్ ని చేరుకోవడానికి ఈ మోడల్ కి లాంచ్ సమయం నుంచి కేవలం 12 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇంకా మరో లక్ష యూనిట్ల సేల్స్ ని చేరుకోవడానికి 10 నెలల సమయం పట్టింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఈ మోడల్ కి ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు.
ముఖ్యమైన అంశం ఏంటి అంటే, 2023-ఆర్ధిక సంవత్సరంలో 51,315 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను మారుతి సుజుకి విక్రయించగా, తదుపరి 2024-ఆర్ధిక సంవత్సరంలో 1,21,169 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను విక్రయించింది. సేల్స్ నంబర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, హైబ్రిడ్ మరియు ఎస్- సిఎన్‍జి వెర్షన్లకు కొనసాగుతున్న విపరీతమైన డిమాండ్ అని చెప్పవచ్చు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 27,066 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను మారుతి సుజుకి కంపెనీ విక్రయించగా, ఫెస్టివల్ సీజన్ వస్తున్న కారణంగా ఈ సేల్స్ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్