- పెట్రోల్ మరియు సిఎన్‍జి వెర్షన్‌లో అందించబడుతున్న మోడల్
- 2023లో ఇండియాలో లాంచ్ అయిన ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏప్రిల్ 2023లో ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. ఇది ఇండియాలో లాంచ్ అయిన 17 నెలలకే, బాలెనో-బేస్డ్ క్రాస్ఓవర్ భారీ అమ్మకాల మైలురాయిని సాధించింది. అలాగే, మార్కెట్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతు మారుతి ఫ్రాంక్స్ పై ఆటోమేకర్ రెండు లక్షల కార్లను నమోదు చేసింది.
మారుతి ఫ్రాంక్స్ లాంచ్ అయిన 10 మరియు 14 నెలల్లో లోపే వరుసగా 1,00,000 మరియు 1,50,000 యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఇది మొదట రూ.7.46 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం, ఇది కూపే క్రాస్ఓవర్ ఎంట్రీ-లెవల్ లో మాత్రమే రూ. 7.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. ఇక వేరియంట్స్ విషయానికొస్తే, ఇది సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (O), జీటా మరియు ఆల్ఫా అనే 6 వేరియంట్‌లలో లభిస్తుంది.
మెకానికల్‍గా, ఫ్రాంక్స్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంకా సిఎన్‍జి ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అనే మూడు పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్స్ తో అందించబడింది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప