- ఏప్రిల్ -2023లో లాంచ్ అయిన ఫ్రాంక్స్కేవలం పది నెలల్లోనే ఒక లక్ష ఫ్రాంక్స్ కార్ల విక్రయం
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్ 2023లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి విపరీతమైన డిమాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు 1.5 లక్షల యూనిట్ సేల్స్ తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మరో సరికొత్త రికార్డుని సాధించింది. ఈ బాలెనో-బేస్డ్ హ్యాచ్ బ్యాక్ఈ ల్యాండ్ మార్కును చేరుకోవడానికి కేవలం 14 నెలల సమయం మాత్రమే పట్టగా ఇప్పటి దాని సేల్స్ ని విజయవంతంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా, ఈ బ్రాండ్ లాంచ్ అయినప్పటి నుంచి కేవలం 10 నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించింది.
యావరేజ్ గా చూస్తే, మారుతి సుజుకి కంపెనీ ప్రతి నెలా 10,000 నుంచి 12,000 యూనిట్ల ఫ్రాంక్స్ కార్లను విక్రయించడం ద్వారా, బాలెనో హ్యచ్ బ్యాక్ తర్వాత మోస్ట్ పాపులర్ నెక్సా మోడల్ గా నిలిచింది. తాజాగా, కస్టమర్ల దృష్టిని ఆకర్షించేలా అదనపు ఫీచర్లతో ఫ్రాంక్స్ లో రెండు కొత్త వేరియంట్లను ఆటోమేకర్ లాంచ్ చేసింది.
బానెట్ కింద, ఫ్రాంక్స్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్లతో వచ్చింది. మొదటి 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని సెలెక్ట్ వేరియంట్లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో పొందవచ్చు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల పరంగా, మారుతి ఫ్రాంక్స్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఎఎంటి, మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్