- స్టాండర్డ్ గా టైర్ రిపేర్ కిట్ ని పొందిన ఫ్రాంక్స్
- రూ.7.51 లక్షలతో ధరలు ప్రారంభం
మారుతి సుజుకి ఇటీవల ఇండియాలో ఫ్రాంక్స్ లో రెండు కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసింది. దీనితో, క్రాస్ఓవర్ ఇప్పుడు సిగ్మా, డెల్టా, డెల్టా+, డెల్టా+ (O), జీటా మరియు ఆల్ఫా అనే 6 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీనిని రూ. 7.51 లక్షలు ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు. అలాగే ఈ అప్‌డేట్‌తో, ఆటోమేకర్ చేసిన అతి పెద్ద మార్పు ఏంటి అంటే, అన్ని వేరియంట్లలో టైర్ రిపేర్ కిట్ ని స్టాండర్డ్ గా అందించడానికి స్పేర్ వీల్‌ను తొలగించింది.
బ్రాండ్ ప్రకారం, కస్టమర్లు అదనపు సౌకర్యాన్ని పొందేందుకు స్పేర్ టైర్ స్థానంలో టైర్ రిపేర్ కిట్ ను జోడించింది. ముఖ్యంగా, ఫ్రాంక్స్ కారు 195/60 ప్రొఫైల్ 16-ఇంచ్ వీల్స్ పై నడుస్తుంది. అదేవిధంగా, ఎంట్రీ-లెవల్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్‌లు వీల్ కవర్‌లతో కూడిన స్టీల్ వీల్స్‌ను కలిగి ఉండగా, అన్ని ఇతర వేరియంట్‌లు అల్లాయ్ వీల్స్‌ను పొందుతాయి. అయితే, టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్ మాత్రమే ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
మెకానికల్‍గా, ఫ్రాంక్స్ రెండు ఇంజిన్‌లతో ఉంటుంది - 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్. మొదటి ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. అలాగే, రెండోది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌ను పొందుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప