- 5 వేరియంట్స్ లో లభ్యం
- రూ.7.46 లక్షల నుండి ధరలు ప్రారంభం
ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇండియాలో రూ.7.46 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో విక్రయించబడుతుంది. ఈ మోడల్ మొదటగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. లాంచ్ అయినప్పటి నుండి, ఈ బాలెనో బేస్డ్ క్రాస్ ఓవర్ మొట్ట మొదటిసారిగా డిస్కౌంట్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
సుజుకి ఫ్రాంక్స్‌ని పెట్రోల్ మరియు సిఎన్జిపవర్ట్రెయిన్ ఆప్షన్స్ లో సిగ్మా, డెల్టా, డెల్టా, ప్లస్, జీటా మరియు ఆల్ఫా అనే 5 వేరియంట్స్ లో పొందవచ్చు. ఇక డిస్కౌంట్స్ విషయానికి వస్తే, ఈ మోడల్ యొక్క పెట్రోల్ వేరియంట్స్ పై రూ.25,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 10,000 ఉన్నాయి. ఇందులో గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆఫర్స్ కేవలం 31 డిసెంబర్, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మెకానికల్ గా, ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఒకటి, 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ అయితే, రెండోది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మొదటిది 89bhp మరియు 113Nm టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, అయితే ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటియూనిట్తో జత చేయబడింది. అదే విధంగా, దీని మోస్ట్ పవర్ ఫుల్ టర్బో మోటార్ 99bhp మరియు 147Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. రెండోది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇంకా చెప్పాలంటే, ఫ్రాంక్స్ యొక్క సిగ్మా మరియు డెల్టా వేరియంట్లను కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్జి కిట్ ఆప్షన్ తో రూ.8.41 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్