- 22.89కెఎంపిఎల్ మైలేజీ అందిస్తున్నట్లు పేర్కొన్న మారుతి
- 8.82 లక్షలతో ఫ్రాంక్స్ ఎఎంటి వెర్షన్ ధరలు ప్రారంభం
ఒక సంవత్సరానికి పైగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఇండియాలో విక్రయించబడుతుంది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక సేల్స్ ద్వారా అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో దూసుకెళ్తుంది. బాలెనో-బేస్డ్ క్రాస్ ఓవర్ కారు ప్రస్తుతం ఆరు వేరియంట్లలో రూ.7.51 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో ఫ్రాంక్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు రియల్-వరల్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని మేము టెస్ట్ చేశాము. ఆ సమయంలో ఫ్రాంక్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ హైవేపై 19.09కెఎంపిఎల్ మైలేజీని, సిటీలో 14.25కెఎంపిఎం మైలేజీని అందించింది. ఇప్పుడు, క్రాస్ ఓవర్ ఎఎంటి వెర్షన్ రియల్-వరల్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని టెస్ట్ చేశాము. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎఎంటి కారును 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే, అది కూడా డెల్టా వెర్షన్లో రూ.8.82 లక్షల ఎక్స్-షోరూం ధరతో పొందవచ్చు. ఈ మోటార్ 89bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా దీని ఫ్యూయల్ ఎఫిషియన్సీ నంబర్ల విషయానికి వస్తే, ఫ్రాంక్స్ 5-స్పీడ్ ఎఎంటి వెర్షన్ కారు 22.89కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తున్నట్లు మారుతి పేర్కొంది.
మా టెస్టులలో, అన్ని ఇతర మోడల్స్ పై టెస్టింగ్ నిర్వహించినట్లు ఈ మోడల్ పై ఒకేరీతిగా స్టాండర్డ్ ప్రాక్టీస్ ని ఫాలో టెస్టింగ్ నిర్వహించాము. మొదటగా, ఫ్యాన్ స్పీడును ఒకటి లేదా రెండులో ఉంచి ఏసీ టెంపరేచర్ ని 23 డిగ్రీలకు సెట్ చేశాము. ఇంకా, మేము టెస్టింగ్ చేస్తున్న వేరియంట్లో ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ ఉన్నందున ఇంజిన్ ఆన్ లో ఉంచి, డీఫాల్ట్ కి సెట్ చేశాము.
సిటీలో అందించిన మైలేజీని విషయానికి వస్తే, మేము 6.62 లీటర్ల ఫ్యూయల్ ని వినియోగించి 78.6 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాము. మొత్తంగా చూస్తే, మల్టీ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లేలో 14కెఎంపిఎల్ మైలేజీ అందించినట్లు చూపించగా, దీని రియల్-వరల్డ్ మైలేజీని లెక్కించినపుడు 11.8కెఎంపిఎల్ మైలేజీ అందించినట్లు తెలిసింది.
అదే విధంగా, హైవేపై ఫ్రాంక్స్ ఎఎంటి కారును 5.04 లీటర్ల ఫ్యూయల్ ని వినియోగించి, 91.7 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేశాము. మల్టీ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లేలో ఈ కారు 14.9కెఎంపిఎల్ మైలేజీని అందించినట్లు చూపించగా, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. రియల్ వరల్డ్ నంబర్లు చూస్తే, ఈ కారు 18.1కెఎంపిఎల్ మైలేజీతో మరింత ఎక్కువ మైలేజీని అందించినట్లు తెలుస్తుంది. చివరగా, హైవేపై మరియు సిటీలో అందించిన మైలేజీని కలిపి చూస్తే, ఫ్రాంక్స్ ఎఎంటి కారు లీటరుకు 13.37 కిలోమీటర్ల మైలేజీని అందించినట్లు తెలుస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పోలిస్తే ఇది కేవలం 58 శాతంగా ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్