- మానేసర్ వద్ద సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పిన మారుతి
- సంవత్సరానికి 9 లక్షల యూనిట్ల ఉత్పత్తే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రొడక్షన్
మారుతి సుజుకి ఇండియా దాని మానేసర్ ఫెసిలిటీ వద్ద అదనపు వెహికిల్ అసెంబ్లీ లైన్ ని ఏర్పాటు చేసింది. ఇది వరకే మానేసర్ వద్ద నెలకొల్పిన ప్లాంట్-ఎ 3 మానుఫాక్చరింగ్ ప్లాంట్లకు నూతనంగా ఏర్పాటైనది జతచేయబడింది. ఈ కొత్త అసెంబ్లీ లైన్ ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్లను తయారు చేసే కెపాసిటీని కలిగి ఉంది.
ఈ అప్‍డేట్ ద్వారా, ఈ ఫెసిలిటీతో మొత్తం మానుఫాక్చరింగ్ కెపాసిటీ ఇప్పుడు సంవత్సరానికి 9 లక్షల యూనిట్లకు చేరుకుంది.ఈ కొత్త అసెంబ్లీ లైన్ నుండే మొదటి యూనిట్ గా ఎర్టిగా మోడల్ బయటకు వచ్చింది. ఈ ప్లాంట్ నవంబర్ 2007లో మొత్తం 1 లక్ష కార్లను ఉత్పత్తి చేసి దాని మొదటి మైలురాయిని చేరుకుంది. అలాగే,ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 95 లక్షల కార్లను ఉత్పత్తి చేసి మరో కీలక మైలురాయిని చేరుకుంది.
మోడల్స్ పరంగా, ఈ ప్లాంట్ వ్యాగన్ ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో, డిజైర్, సియాజ్, బ్రెజా, ఎర్టిగా మరియు XL6 వంటి కార్లను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, మానేసర్ ప్లాంట్ 95 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేసి మారుతి సుజుకి మూడు కోట్ల కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంలో ఎంతగానో దోహదపడింది.
కొత్త అసెంబ్లీ లైన్ కస్టమర్లకు మరింత సహాయపడుతుంది, ఈ కొత్త ప్లాంటు పైన పేర్కొన్న మోస్ట్ పాపులర్ కార్లను కస్టమర్లు పొందడానికి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తుంది. పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా, మారుతి సుజుకి రానున్న 7 – 8 సంవత్సరాల్లో దాని ప్రొడక్షన్ కెపాసిటీని మరింత పెంచుతూ 40 లక్షల యూనిట్లకు పెంచేలా ప్లాన్ చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్