- 2024 చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం
- గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ వెహికల్
మారుతి సుజుకి భారతదేశంలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ ఈవిఎక్స్ ని తీసుకురావడానికి చాలా కృషి చేస్తోంది. ఇది టాటా నెక్సాన్ ఈవీ మరియు మహీంద్రా ఎక్స్‌యువి400తో ప్రధానంగా పోటీగా పడడమే కాకుండా, ఒక బోర్న్-ఎలక్ట్రిక్ ఎస్‌యువి అవుతుంది. ఇప్పుడు, ఈ బ్రాండ్ రాబోయే మారుతి సుజుకి ఈవిఎక్స్ చుట్టూ జరుగుతున్న ప్లాన్ మరియు స్ట్రాటెజీలను వెల్లడించింది.
ఇండియన్ ఆటోమేకర్2024 చివరిలో దేశం అంతటా ఈవిఎక్స్ ఎస్‌యువిని పరిచయం చేస్తుంది. అంతేకాకుండా దీని ధరను అదుపులో ఉంచడానికి మరియు మోడల్ ధరను సంకేతముగా ఉంచడానికి, ఈ బ్రాండ్ మోడల్‌ను మొత్తం మేధా లోకలైజ్ చేయనుంది స్థానికీకరిస్తుంది. అలాగే, ఇది యూరప్‌తో ప్రారంభించి భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
ఇటీవల, ఎలక్ట్రిక్ మోడల్ ను భారతదేశంలో స్పై టెస్టింగ్ చేస్తుండగా కీలక వివరాలను వెల్లడయ్యాయి. 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కోసం ఓఆర్ విఎం -మౌంటెడ్ కెమెరా, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్టాప్ ల్యాంప్‌తో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, వాషర్‌తో రియర్ వైపర్ మరియు సి-పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, మారుతి బ్రాండ్ 60kWh బ్యాటరీ ప్యాక్ యూనిట్ మరియు పూర్తి ఛార్జ్‌పై సుమారుగా 500కిమీల డ్రైవింగ్ రేంజ్ వివరాలతో పాటుగా టెక్నికల్ అంశాలను వెల్లడించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప