- వచ్చే సంవత్సరంలో లాంచ్ కానున్న eVX ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ
- ఇండియాలో మారుతి నుంచి అందించబడనున్న మొదటి ఎలక్ట్రిక్ కారు
మారుతి సుజుకి ప్రస్తుతం ఇండియాలో మార్కెట్లో eVX అనే మొదటి ఎలక్ట్రిక్ కారు తీసుకురావడానికి, దానిపై వర్క్ చేస్తుంది. 2025 ప్రారంభంలో అరంగేట్రం చేయనుండగా, దాని కంటే ముందుగా eVX కొత్త స్పై ఫోటోలు బహిర్గతమయ్యాయి. అందులో ఈ అప్ కమింగ్ మిడ్-సైజ్ eVX ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన లేటెస్టు వివరాలు మరియు ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ స్పై షాట్లలో చూసిన విధంగా, అప్ కమింగ్ మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్ లుక్ లో టెస్టింగ్ చేయబడుతుంది. ఇందులో కొత్తగా లాంచ్-స్పెక్ కారులో కనిపించే అంశాలలోని హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్ ఉన్నాయి. అలాగే ఇది కారు కింది భాగాన ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ డిజైన్ తో టూ-పీస్ ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్) మరియు కారు పై భాగాన పొడవుగా లైన్ ని కలిగి ఉంది.
మరోవైపు, eVX టెయిల్ లైట్స్ గురించి చెప్పాలంటే, బ్రేక్ లైన్ ప్యాటర్న్ తో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ యాంగులర్ సెట్ ఫీచర్ ని పొందగా, ఇది అచ్చం ముందు భాగంలో ఉన్న డీఆర్ఎల్స్ మాదిరిగా ఉంది. అలాగే, కారు వెనుక భాగంలో ఒక ఎల్ఈడీ లైట్ బార్ కూడా అందించేబడే అవకాశం ఉంది.
వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానున్న మారుతి eVXకారులో మరెన్నో కొత్త ఫీచర్లు అందించబడతాయని మనం భావించవచ్చు. అందులో 360-డిగ్రీ కెమెరా, డ్రైవ్ మోడ్స్ కోసం రోటరీ డయల్, టూ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు మరియు మరెన్నో కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఈవీ మరియు హోండా ఎలివేట్ వంటి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలతో పోటీపడనున్న eVXఎలక్ట్రిక్ కారు టెక్నికల్ స్పెసిఫికేషన్లకు సంబంధించి మారుతి కంపెనీ ఏమాత్రం పేర్కొనలేదు. ఇది లాంచ్ అయ్యే సమయానికి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దీని ఎలక్ట్రిక్ మోటార్ 60kWh బ్యాటరీ ప్యాక్ తో జతచేయబడి రానుండగా, సింగిల్ ఫుల్ ఛార్జ్ పై 550 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.
ఫోటో మూలం
అనువాదించిన వారు: సంజయ్ కుమార్