- అన్ని వేరియంట్లపై ఒకే విధంగా ధర పెంపును పొందిన ఎర్టిగా
- అందుబాటులో ఉన్న4 వేరియంట్స్
గత నెలలో, మారుతి సుజుకి జనవరి, 2024 నుండి తన అన్ని మోడల్స్ పైధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈమొత్తం ధరల పెరుగుదలకు పెరిగిన వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్భణం కారణం అని ఆటోమేకర్ వెల్లడించింది. కాకపోతేమారుతి సుజుకి ఎర్టిగా వేరియంట్స్ పై మాత్రం ఒకే విధంగా రూ. 5,000 వరకు ధరలు పెరిగాయి.
దీనితో , ఈ మూడు-వరుసల ఎంపివిని ఇప్పుడు రూ. 8.69 లక్షల నుండి రూ. 13.03 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. అంతేకాకుండా, ఈ కారుని LXi(O), VXi(O), ZXi(O), మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్స్ లో నుండి, ఏడు వేరే వేరే ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్స్‌లో కస్టమర్‌లు ఎంచుకోవచ్చు.
ఎర్టిగాలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102bhp మరియు 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగా, ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో జత చేయబడి ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. ఇందులో 87bhp మరియు 121Nm టార్క్ ఉత్పత్తి చేసే సిఎన్‍జి వేరియంట్ కూడా ఆఫర్‌లో ఉంది. ఈ మోటార్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
వేరియంట్ వారీగా మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
LXi(O) | రూ. 8,69,000 |
VXi(O) | రూ. 9,83,000 |
VXi(O) సిఎన్‍జి | రూ.10,78,000 |
ZXi(O) | రూ.10,93,000 |
VXi ఏటీ | రూ. 11,23,000 |
ZXi ప్లస్ | రూ. 11,63,000 |
ZXi(O) సిఎన్‍జి | రూ. 11,88,000 |
ZXi ఏటీ | రూ. 12,33,000 |
ZXi ప్లస్ ఏటీ | రూ. 13,03,000 |
అనువాదించిన వారు: రాజపుష్ప