- చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 2-స్టార్ రేటింగ్
- 2019 గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ 3-స్టార్ స్కోర్ చేసిన ఎర్టిగా కారు
కార్ మేకర్ మారుతి సుజుకి నుంచి వచ్చిన ఎర్టిగా కారు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ద్వారా టెస్టింగ్ చెయబడగా, అందరిని నిరాశపరిచేలా దారుణంగా రిజల్ట్స్ ని అందుకుంది. క్రాష్ టెస్ట్‌లో ఎర్టిగా కారు పేలవంగా కేవలం ఒక స్టార్ మాత్రమే స్కోర్ చేసింది. ఈ ఎంపివిఇండియాలో తయారు చేయబడగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు లోడ్ లిమిటర్‌తో కూడిన సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇది వెనుక వరుస సీట్లలో ఐసోఫిక్స్చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లను కూడా పొందింది.
ఎర్టిగా కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 23.63 పాయింట్లు మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 19.40 పాయింట్లు స్కోర్ చేసింది. ఫలితాలను బట్టి చూస్తే, డ్రైవర్ మరియు ప్యాసింజర్ హెడ్ (తల) మరియు మెడకు అద్బుతంగా ప్రొటెక్షన్ అందించబడింది. ఈ కారులో ఫుట్‌వెల్ మరియు బాడీ షెల్ అస్థిరంగా ఉన్నట్లు మరియు తదుపరి ఎక్కువ లోడ్ ని కూడా తట్టుకోలేవని రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.
ఎర్టిగా టాప్-ఎండ్ వేరియంట్‌లలో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్ మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎర్టిగా కారులో అందించబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి లభిస్తుండగా, ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102bhp మరియు 136.8Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్