- సెగ్మెంట్లో 37.5 కార్ మార్కెట్ షేర్ తో ఆధిక్యం
- రూ. 8.69 లక్షలతో ప్రారంభమైన ధరలు
ఎర్టిగా ఎంపివి ద్వారా ఇండియన్ ఆటోమేకర్, మారుతి సుజుకి కొత్త మైల్‍స్టోన్‌ని సాధించింది. కస్టమర్లు అమితంగా ఇష్టపడే ఈ పాపులర్ మోడల్ 2012లో లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను విక్రయించి డొమెస్టిక్ సేల్స్ లో రారాజుగా కొనసాగుతుంది. దీంతో, ఇండియాలో తక్కువ సమయంలోనే ఈ ఫీట్ ని సాధించిన ఎంపివి మోడల్ గా ఎర్టిగా నిలిచింది.
ప్రస్తుతం మారుతి సుజుకి ఎర్టిగా ఆటో ఇండస్ట్రీలో37.5మార్కెట్ షేర్ తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇది LXi (O), VXi (O), ZXi (O), మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
2012లో లాంచ్ తర్వాత, ఈ ఎంపివి అత్యధిక పాపులారిటీ లభించడంతో కేవలం సంవత్సరంలోపే ఒక లక్షకు పైగా కార్ల సేల్స్ ని సాధించింది. అదే విధంగా, 2019లో 5 లక్షల సేల్స్ సాధించింది మరియు దాని పెర్ఫార్మెన్స్ మరియు మార్కెట్లో కొనసాగుతున్న తీరు కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించింది.
మారుతి సుజుకి ఎర్టిగా సక్సెస్ పై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ఎర్టిగా ఎమ్‌పివి కాన్సెప్ట్ స్టైలిష్ గా మరియు టెక్నికల్ గా మెరుగుపరిచి సరికొత్త ఆఫర్‌గా వచ్చింది. ఫ్యామిలీ మరియు స్నేహితులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడే, ప్రతి స్టేజ్ లో సామూహిక అనుభవాలను పొందడానికి ఇష్టపడే యువ, సాంకేతిక స్పృహ కలిగిన కస్టమర్‌లకు ఇది ప్రాధాన్య ఎంపికగా మారింది. ఎర్టిగా యొక్క మోడరన్ అట్రాక్షన్, 41 శాతం వరకు యువ పట్టణ కస్టమర్లు పెరిగారు ఎర్టిగా కొనుగోలుదారులలో 66% మంది దీనిని ముందుగా నిర్ణయించిన ఆప్షన్ గా పరిగణించడం, లైఫ్ స్టైల్ ఫ్యామిలీ వెహికిల్ దాని పిక్చర్-పర్ఫెక్ట్ అప్పీల్‌ను సుస్థిరం చేయడం కూడా గమనించదగ్గ విషయం. స్టైలిష్ బేస్ గా వచ్చిన ఎర్టిగా 37.5 శాతం సెగ్మెంట్ మార్కెట్ వాటాతో, సిటీ మరియు రూరల్ మార్కెట్లలో దేశవ్యాప్తంగా విజయవంతమైంది.” అని తెలిపారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్