- డైనమిక్ ఫీచర్స్ తో బెంచ్ మార్క్ సేల్స్ క్రియేట్ చేసిన డిజైర్
- 15 ఏళ్ల నుంచి ఆటో ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్న డిజైర్
మారుతి సుజుకి నుంచి వచ్చిన డిజైర్ 50% షేర్ మార్కెట్ తో 25లక్షల కస్టమర్ సేల్స్ తో ఆటో మొబైల్ మార్కెట్ ను డామినేట్ చేస్తూ కొత్త మైల్ స్టోన్ ని క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో పెద్దగా ఎలాంటి కాంపిటీషన్ లేకుండా మిలియన్ కస్టమర్లకు చేరువయింది.
మైల్ స్టోన్ గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ సేల్స్ హెడ్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా మారుతి సుజుకి అన్నీ సెగ్మెంట్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ ఫీచర్స్, డిజైన్ తో బెంచ్ మార్క్ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసిందని, తమ కస్టమర్లు ఎక్కువగా డిజైర్ లాంటి సెడాన్ కార్స్ ఇష్టపడుతున్నారని, మా బ్రాండ్ ని విశ్వసించిన 25 లక్షల కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.
డిజైర్ ఒక బ్రాండ్ గా డెవలప్ అవుతూ న్యూ బోల్డ్ ఫ్రంట్ ఫేసియా, సన్నని టూ-టోన్ అల్లాయ్ వీల్స్ తో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా స్టైలిష్ ఎక్స్ టీరియర్ లుక్స్ తో వస్తుంది. ఇది ప్రీమియం మరియు స్పేషియస్ ఇంటీరియర్ తో కస్టమర్లకు కంఫర్ట్ మరియు కన్వీనియన్స్ కలిగిస్తుంది. ఇందులో ఉన్న ఆటోమేటిక్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, అటో ఫోల్డింగ్ రేర్ వ్యూ మిర్రర్స్, స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, అటోమేటెడ్ గేర్ షిఫ్ట్ సిస్టం లాంటి ఒక రేంజ్ ఫీచర్స్ డైనమిక్ మరియు టెక్ కస్టమర్లకు డిజైర్ మరింత చేరువయ్యింది.
తాజా మైల్ స్టోన్ తో డిజైర్ సెడాన్ కేటగిరీలో కస్టమర్ల ఛాయిస్ పరంగా మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గత 15 ఏళ్లుగా 3 జనరేషన్స్ సెడాన్ గా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతూ డిజైర్ కొనసాగుతూ వస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్