- 1983 నుంచి ఇండియాలో దాని ఆపరేషన్స్ కొనసాగిస్తున్న మారుతి
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు మానుఫాక్చరింగ్ సెంటర్లను కలిగి ఉన్న బ్రాండ్
ఇండియాలో అతి పెద్ద ఆటోమేకర్లలో ఒకటైన మారుతి సుజుకి 3 కోట్ల కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త మైల్‍స్టోన్‍ని అధిగమించింది. ఈ మైల్‍స్టోన్‍ని చేరుకోవడానికి మారుతి సుజుకి కంపెనీకి 40 సంవత్సరాలు 4 నెలలు పట్టింది. మీకు తెలుసో లేదో, 1983లో మారుతి బ్రాండ్ దాని ఆపరేషన్లను ఇండియాలో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సక్సెస్ రేటుతో ఇండియాలో విజయవంతంగా కొనసాగుతుంది.
మొత్తం 3 కోట్లలో, 2 కోట్ల 68 లక్షల వెహికిల్స్ కంపెనీకి చెందిన హర్యానా ప్లాంటులో ఉత్పత్తి కాగా, 32 లక్షల కార్లు పూర్తి-సబ్సిడీ ఎంఎస్ఐఎల్ సుజుకి మోటార్ గుజరాత్ లో ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ మైల్‍స్టోన్‍ని సాధించడంలో ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, M800, డిజైర్, ఓమ్ని, బాలెనో, ఈకో, బ్రెజా మరియు ఎర్టిగా కార్లు పాలుపంచుకున్నాయి.
ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ, “మేము 1983లో మానుఫాక్చరింగ్ ప్రారంభించినప్పటి సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం మా ప్రొడక్ట్స్ పై అపారమైన విశ్వాసాన్ని చూపుతున్న మా కస్టమర్‌లకు ధన్యవాదాలు. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రొడక్ట్స్ ని తయారు చేయడంలో మాకు సహాయం చేసిన మా వర్క్‌ఫోర్స్ మరియు వాల్యూ చైన్ పార్టనర్స్ పూర్తి మద్దతు ద్వారా మా ప్రొడక్షన్ ని పెంచుకోగలిగాము. మేము ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రొడక్ట్స్ కి కట్టుబడి మరియు దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో మా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. ఇండియా నుండి మొత్తం వాహనాల ఎగుమతులలో దాదాపు 40 శాతం మేర మేము ఉత్పత్తి చేసినవే ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాము” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్