- ఇండియాలో రూ.9.30 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభంకానున్న ధరలు
- 4 వేరియంట్స్ లో లభ్యం
మారుతి సుజుకి సియాజ్ ని కొనుగోలు చేయాలనుకునే వారు మేము చెప్పే ఈ శుభవార్తను పూర్తిగా చదివి దీనిపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి. మారుతి సుజుకి డిసెంబరు-2023లో సెడాన్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఒకవేళ మీరు సియాజ్ ని కొనుగోలు చేయాలనుకుంటే, దానిపై రూ. 53,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000ఎక్స్చేంజ్ బోనస్, మరియు రూ. 3,000 కార్పోరేట్ డిస్కౌంట్ కలిపి ఉన్నాయి. ప్రస్తుతం, ఈ సెడాన్ సిగ్మా, డెల్టా, జీటా, మరియు ఆల్ఫా అనే 4 వేరియంట్స్ లో రూ.9.30 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
కింద హుడ్ లో, హోండా సిటీతో పోటీ పడుతున్న దీని బిఎస్-6 ఫేజ్-2 మరియు ఆర్డీఈ కంప్లైంట్ 1.5 పెట్రోల్ ఇంజిన్ 103bhp మరియు 138Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు ఈ ఇంజిన్ ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్