- 4 వేరియంట్లలో లభ్యం
- ఇండియాలో రూ.8.29 లక్షలతో ప్రారంభంకానున్న ధరలు
ఇండియాలో మోస్ట్ పాపులర్ మోడల్స్ లో మారుతి సుజుకి బ్రెజా ఒకటి అని చెప్పవచ్చు. ఇండియన్ ఎస్యూవీ అయిన మారుతి సుజుకి బ్రెజా స్వదేశీ ఆటోమేకర్ నుంచి వచ్చి మరోసారి బెస్ట్ సెల్లర్‌గా రుజువు చేయబడింది. దీని ఫలితంగా, బ్రెజా 2023లో ఆటోమేకర్ నుండి అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్‌గా నిలిచింది.
గత సంవత్సరం మారుతి సుజుకి మొత్తం 17.7 లక్షల వెహికిల్స్ విక్రయించింది. అందులో కేవలం బ్రెజా ఎస్యూవీ విక్రయాలతో దేశవ్యాప్తంగా 1.70 లక్షల యూనిట్ల అమ్మకాలను రిజిస్టర్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
మారుతి సుజుకి బ్రెజా మొత్తం 4 వేరియంట్లలో రూ. 8.29 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ మోడల్ యొక్క పవర్డ్ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడింది. ఇందులోని మోటార్ 103bhp పవర్ మరియు 138Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్