- ఒరిజినల్ గా విటారా బ్రెజాగా విక్రయం
- ప్రస్తుతం 4 వేరియంట్లలో లభ్యం
ఆటో మార్కెట్ రారాజు మారుతి సుజుకి దాని సరికొత్త మోడల్ బ్రెజా ఎస్‍యూవీ ద్వారా ఇండియాలో సరికొత్త సేల్స్ మైల్‍స్టోన్‍ని సాధించింది. దేశవ్యాప్తంగా ఈ ఆటోమేకర్ బ్రెజా మరియు విటారా బ్రెజాలతో కలిపి మొత్తంగా 10 లక్షలకు పైగా విక్రయించి, కొత్త రికార్డును సృష్టించింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఫస్ట్-జెన్ విటారా బ్రెజా 2016లో మార్కెట్లోకి ప్రవేశించింది.
మారుతి నుంచి వచ్చిన ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ టాటా నెక్సాన్‌ను అధిగమించి2024 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‍యూవీగా నిలిచింది. ఓ లెక్కన చూస్తే, సగటున మారుతి సుజుకి ప్రతి నెలా 13,000 నుండి 15,000 యూనిట్ల వరకు బ్రెజా కార్లను విక్రయించింది.
ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజా రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అదే విధంగా ఇది LXi, VXi, ZXi, మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్లలో లభిస్తుంది. మెకానికల్ గా, ఈ ఎస్‍యూవీ యొక్క 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో జతచేయబడింది. అలాగే ఈ మోటార్ 103bhp పవర్మరియు 138Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సును కలిగి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్