- అందుబాటులో ఉన్న పెట్రోల్ మరియు సిఎన్జి పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
- పెట్రోల్ వేరియంట్స్ పై లభించనున్న భారీ డిస్కౌంట్స్
ప్రస్తుతం ఇండియాలో మారుతి సుజుకి బాలెనో రూ. 6.61 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో విక్రయించబడుతుంది. ఈ హ్యచ్ బ్యాక్ 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఏవి అంటే – సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా. ఇవి పెట్రోల్ మరియు సిఎన్జి పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో ఉన్నాయి. నవంబరులో, ఈ ఆటోమేకర్ బాలెనో హ్యచ్ బ్యాక్ పై రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది.
ఇప్పుడు మనం పెట్రోల్ వేరియంట్స్ గురించి మాట్లాడినట్లయితే, వీటిపై రూ. 20,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ మరియు రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ వంటి డిస్కౌంట్స్ లభించనున్నాయి. అదే విధంగా సిఎన్జి వెర్షన్స్ పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 25,000 ఎక్స్చేంజ్ బోనస్ తో కలిపి మొత్తం రూ.35,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి.
దీనిలో ఉన్న మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, బాలెనో హ్యచ్ బ్యాక్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంది. దీని మోటార్ 88bhp మరియు 113Nm పీక్ టార్క్ ని ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఈ మోడల్ లోని డెల్టా మరియు జీటా వేరియంట్స్ సిఎన్జి ఆప్షన్స్ ని కూడా కలిగి ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్