- నాలుగు వేరియంట్లలో అందించబడుతున్న ఆల్టో K10 మోడల్
- మారుతి సుజుకి ఆల్టో K10ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు
మారుతి సుజుకి బ్రాండ్ దేశవ్యాప్తంగా దాని ఎంట్రీ లెవెల్ హ్యచ్ బ్యాక్ ఆల్టోK10 మోడల్ లోని కొన్ని యూనిట్లను స్వచ్చందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు స్టీరింగ్ గేర్ బాక్సు అసెంబ్లీలో ఎదుర్కొంటున్న సమస్యను పరీక్షించి, పరిష్కరించాలనే వీటిని రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్య కారణంగా, ఆల్టో K10 కారు స్టీరింగ్ సామర్థ్యం దెబ్బతింటున్నట్లు ప్రాథమిక సమాచారం.
రీకాల్ లో భాగంగా, ఈ సమస్యను ఎదుర్కొంటున్న 2,555 ఆల్టోK10యూనిట్లను మారుతి సుజుకి గుర్తించింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా, కస్టమర్లు వారి వెహికిల్ లో సమస్య ఎదురైన భాగాన్ని మార్చేంత వరకు డ్రైవ్ చేయకుండా ఉండడమే ఉత్తమం. అదేవిధంగా, ఎవరైతే కస్టమర్లు ఆల్టోK10 కారును ఉపయోగిస్తున్నారో వారు, మీకు దగ్గరలో ఉన్న మారుతి సుజుకి అధికారిక సర్వీస్ సెంటరును సందర్శించి సమస్యను చెక్ చేసుకోవచ్చు మరియు ఈ సర్వీసు పూర్తిగా ఉచితం.
ప్రస్తుతం, మారుతి సుజుకి ఆల్టో K10 కారును Std, LXi, VXi, మరియు VXi ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో, పెట్రోల్ మరియు సిఎన్‍జి+పెట్రోల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ఇంకా ధరల విషయానికి వస్తే, ఆల్టో K10 హ్యచ్ బ్యాక్ ఎక్స్-షోరూం ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ లోయర్ స్పెక్ వెర్షన్ గా అందుబాటులో ఉండగా, VXi ప్లస్ వేరియంట్ టాప్-స్పెక్ వెర్షన్ గా అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్