- అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ గా నిలిచిన స్విఫ్ట్
- మొత్తంగా 2 లక్షలకు పైగానే పెండింగ్ లో ఉన్న ఆర్డర్స్
మారుతి ఎస్‍యూవీరేంజ్ లో తన సత్తాను చాటుతుండగా, గత 12 నెలల నుంచి ఈ ఆటోమేకర్ మరో 3 కొత్త వెహికిల్స్ ను జత చేసింది. ఆటోమేకర్ నుండి ఇది కొంతకాలం కొనసాగగా మరియు ముఖ్యంగా చెప్పాలంటే అర్బన్ ఏరియాలలో కేంద్రాలలో కంపెనీ భవిష్యత్ వృద్ధికి తోడ్పాటు పడుతుందని భావిస్తున్నారు. ఎలాగైతే ఏంటి, సిటీల్లో ఉండే వారు హై-రైడింగ్ వెహికిల్స్ డ్రైవ్ చేయడానికి ఇష్టపడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో నాన్- ఎస్‍యూవీ మోడల్స్ సేల్స్ దీనిని డామినేట్ చేస్తున్నాయి.
ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు, మారుతి హ్యచ్ బ్యాక్స్, సెడాన్స్, మరియు ఎంపీవీలతో కలిపి 2.21 లక్షల యూనిట్స్ విక్రయించగా, అందులో 81,000 యూనిట్ల ఎస్‍యూవీ మోడల్స్ ని విక్రయించింది. గత సంవత్సరం పెరుగుదల రేటుతో పోలిస్తే,ఈ సంవత్సరం రూరల్ ఏరియాలలో పెరుగుదల రేటు 11 శాతంగా ఉండగా, అర్బన్ ఏరియాలలో 8 శాతంగా ఉంది.
రూరల్ ఏరియాల్లో నాన్- ఎస్‍యూవీలకు భారీగా డిమాండ్ పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైన దాని గురించి మారుతి చెప్పింది ఏంటి అంటే మొదటిసారి కొనుగోలు చేస్తున్న వారికి ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీలు అధిక రేటును కలిగి ఉండడమే అని పేర్కొంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ఎస్‍యూవీలలో డీజిల్ ఇంజిన్స్ లేకపోవడం, ప్రత్యేకంగా ప్రీమియం ఎండ్ లో అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి, హ్యుందాయ్, కియా, మరియు ఎంజి కంపెనీల నుండి మాత్రమే ప్రీమియం డీజిల్-పవర్డ్ కార్లు ఉన్నాయి. ఎలాగైతే ఏంటి, ఈ ట్రెండ్ మారవచ్చు అని భావిస్తున్నాం, ఎందుకంటే ఈ ఆర్ధిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో మారుతి నుంచి వచ్చిన చిన్న కార్ల షేర్ 5 శాతం మేర తగ్గి, 48 శాతం నుంచి 43 శాతానికి పడిపోయింది.
మారుతున్న ఉద్గార నిబంధనల కారణంగా డీజిల్ కార్లు మరింత ప్రియం కానుండగా, పెట్రోల్, సిఎన్‍జి , ఎలక్ట్రిక్, మరియు బయోగ్యాస్ ఇన్వెస్ట్ చేసే ట్రెండ్ ద్వారా మారుతి మంచి ఫలితాలనే రాబట్టే అవకాశం ఉంది మరియు రూరల్ ఏరియాలలో కంపెనీ నుంచి వచ్చే ఎస్‍యూవీల వృద్ధికి బలాన్ని చేకూర్చనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్