- ఇటీవలే లాంచ్ అయిన థండర్ ఎడిషన్
- ఇండియాలో ప్రారంభ ధర రూ. 10.74 లక్షలు
మారుతి సుజుకి జిమ్నీ నుంచి ఇటీవల వచ్చిన 'థండర్' అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధర భారీ మొత్తంలో తగ్గించబడింది. దీనితో, మారుతి సుజుకి యొక్క ఇండియా మేడ్ లైఫ్‌స్టైల్ ఎస్‌యువిని రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
థండర్ ఎడిషన్‌తో, మారుతి జిమ్నీ యొక్క జీటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్‌లు ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందాయి. అయితే, ఈ కథనంలో, మనం జీటా మరియు ఆల్ఫా వేరియంట్‌లలో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో పోల్చి చూద్దాం.
కన్వెయన్స్ ఫీచర్స్ | జిమ్నీ జీటాఎంటి/ఎటి | జిమ్నీఆల్ఫా ఎంటి/ఎటి |
పుష్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్ | - | అవును |
క్రూయిజ్ కంట్రోల్ | - | అవును |
క్లైమేట్ కంట్రోల్ | మాన్యువల్ | ఆటోమేటిక్ |
డ్రైవర్ విండో వన్ టచ్ అప్/డౌన్ | అవును | అవును |
అన్ని పవర్ విండోస్ | అవును | అవును |
టిల్ట్ పవర్ స్టీరింగ్ | అవును | అవును |
సెంట్రల్ డోర్ లాకింగ్ | అవును | అవును |
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ | అవును | అవును |
ముందుకు / వెనుకకు హెడ్‌రెస్ట్ అడ్జస్టబుల్ | అవును | అవును |
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ | 7- ఇంచ్ | 9- ఇంచ్ |
స్పీకర్స్ | 4 | 4 |
ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే | వైర్లెస్ | వైర్లెస్ |
సేఫ్టీఫీచర్స్ | జిమ్నీజీటాఎంటి/ఎటి | జిమ్నీఆల్ఫా ఎంటి/ఎటి |
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ | అవును | అవును |
సైడ్ మరియు కర్టెన్ఎయిర్బ్యాగ్స్ | అవును | అవును |
బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ | అవును | అవును |
యాంటీ -లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్),ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఎబిడి) మరియుఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఎఎస్‍పి) | అవును | అవును |
హిల్ హోల్డ్ మరియు డిసెంట్ కంట్రోల్ | అవును | అవును |
బ్రేక్ అసిస్ట్ | అవును | అవును |
రియర్ వ్యూకెమెరా | అవును | అవును |
సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్ | అవును | అవును |
ఐసోఫిక్స్ మౌంట్స్ | అవును | అవును |
త్రీ-పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్ రిట్రాక్టర్ సీట్‌బెల్ట్స్ | అవును | అవును |
ఇతర ఫీచర్స్ | జిమ్నీజీటా ఎంటి/ఎటి | జిమ్నీఆల్ఫా ఎంటి/ఎటి |
ఆటో హెడ్ ల్యాంప్స్ | - | అవును |
హెడ్ ల్యాంప్ వాషర్ | - | అవును |
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ | - | అవును |
ఫాగ్ ల్యాంప్స్ | - | అవును |
UV కట్ గ్లాస్ | - | అవును |
ఎలక్ట్రిక్ ఒఆర్విఎం | అడ్జస్టబుల్ | అడ్జస్టబుల్ మరియు రెట్రాక్టబుల్ |
ముందు మరియు వెనుక వైపర్ తో వాషర్ | అవును | అవును |
రియర్ డీఫాగర్ | అవును | అవును |
ఐఆర్విఎం | మాన్యువల్ | మాన్యువల్ |
ఫ్రంట్ మరియు రియర్ క్యాబిన్ లైట్ | అవును | అవును |
మెకానికల్‍గా చూస్తే, 5- డోర్ సుజుకి జిమ్నీ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి ఏకైక 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని K15B ఇంజిన్ 103bhp మరియు 134Nm మాక్సిమం టార్క్ ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఈబ్రాండ్ యొక్క ప్రొప్రైటరీ ఆల్ గ్రిప్ ప్రో 4x4 సిస్టమ్ రేంజ్ స్టాండర్డ్ గా రావడంతో , జిమ్నీ దేశంలోనే అత్యంత చవకగా అందుబాటు ధరలో ఉండే 4x4 ఆఫ్-రోడర్‌గా పేరుగాంచింది.
ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికొస్తే, ఈ బ్రాండ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో 16.94కెఎంపిఎల్ మైలేజీని ఇస్తుంది. అయినప్పటికీ, మేము చేసిన టెస్టులలో, జిమ్నీ సిటీలో మరియు హైవే రోడ్లపై వరుసగా 13.21కెఎంపిఎల్ మరియు 15.29కెఎంపిఎల్ మైలేజ్ ని ఇచ్చింది.
అనువాదించిన వారు: రాజపుష్ప