- రూ.12.74 లక్షల నుంచి ప్రారంభంకానున్న జీటా వెర్షన్ ధర
- పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్న జిమ్నీ
పండుగ సీజన్ సందర్భంగా, మారుతి సుజుకి నెక్సా డీలర్స్ అందరూ జిమ్నీ ఎంట్రీ-లెవల్ జీటా వేరియంట్‌పై రూ. 1 లక్ష వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. మారుతి సుజుకి కంపెనీ ఈ 5-డోర్ జిమ్నీని జూన్ 7, 2023న లాంచ్ చేయగా, దీని ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది.
మారుతి సుజుకి జిమ్నీ కొనుగోలుపై కస్టమర్లు ఈ నెలలో రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ బెనిఫిట్స్ ను రూ. 50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా లాయల్టీ బోనస్ రూపంలో మారుతి సుజుకి అందిస్తుంది. ఈ డిస్కౌంట్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లపై అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 5-డోర్ జిమ్నీని కొనుగోలు చేసి ఈ దసరా పండుగను మరింత ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోండి.
జిమ్నీలో 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది, ఇది 103bhp పవర్ మరియు 134Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది. ఇది కాకుండా, ఆల్ గ్రిప్ ప్రో 4x4 సిస్టమ్ మరియు లోవర్ గ్రిప్ రేంజ్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్