- రెండు వేరియంట్లలో అందించబడుతున్న ఆఫ్-రోడర్
- ఆల్ఫా వేరియంట్ పై అత్యధిక బెనిఫిట్స్ అందిస్తున్న మారుతి
మారుతి సుజుకి ఇండియా నుంచి అందించబడుతున్న ఒకే ఒక్క ఎస్‍యూవీ ఏదైనా ఉంది అంటే, అది మారుతి జిమ్నీ అని చాలా ఈజీగా చెప్పేస్తాం. జూలై నెలలో ఈ లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ ఎస్‍యూవీ, జిమ్నీపై మారుతి భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ ఎస్‍యూవీ గత సంవత్సరం లాంచ్ చేయబడగా, కస్టమర్లను ఆకర్షించడానికి మరియు దాని యావరేజ్ సేల్స్ పెంచడానికి మారుతి భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇప్పుడు, ఆటోమేకర్ జిమ్నీపై రూ.3.3 లక్షలకు పైగా బెనిఫిట్స్ అందిస్తుంది. మారుతి పెద్ద మొత్తంలో భారీ డిస్కౌంట్స్ ఈ సంవత్సరంలో మొదటిసారి చెప్పవచ్చు.
మారుతి సుజుకి జిమ్నీని కస్టమర్లు జీటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో పొందవచ్చు. డిస్కౌంట్ల విషయానికొస్తే, మొదటి వేరియంట్ పై రూ. 1.75 లక్షలు వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, రెండవ వేరియంట్ పై రూ. 1.8 లక్షలు వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, మారుతి సుజుకి ఫైనాన్స్ సర్వీస్‌ను సెలెక్ట్ చేసుకున్న కస్టమర్లు రూ. 1.5 లక్షలు వరకు అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. దీని ద్వారా మారుతి జిమ్నీని ప్రధానంగా పోటీపడుతున్న కార్లతో పోల్చినప్పుడు, దీనిపై లభిస్తున్న భారీ డిస్కౌంట్ మరియు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను దృష్టిలో ఉంచుకొని సేల్స్ లో ముందంజ వేయవచ్చని మారుతి కంపెనీ భావిస్తుంది.
కాకపోతే ఇక్కడ ఒక ట్విస్టు ఉంది. అది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఆఫర్లు తాత్కాలికమైనవే. ఇంకా డీలర్‌షిప్, లొకేషన్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఈ బెనిఫిట్స్ తక్కువగా లేదా ఎక్కువగా కూడా ఉండవచ్చు. మీ దగ్గర మరింత డిస్కౌంట్ పొందే విధంగా మంచి స్కిల్స్ ఉంటే, దీనిపై మీరు మరింత ఎక్కువగా డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు.
మెకానికల్ గా, జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఫుల్-టైం 4x4 ఆఫ్-రోడ్ టెక్ మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేసి పొందవచ్చు. అందులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉన్నాయి. ముఖ్యంగా, జిమ్నీ ఫైవ్-డోర్ వెర్షన్‌ను పొందిన మొదటి మార్కెట్ అది ఏదైనా ఉంది అంటే, అది ఇండియా అని గర్వంగా చెప్పవచ్చు.అయితే, అన్ని ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇంకా 3-డోర్ వెర్షన్ మాత్రమే విక్రయించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్