- సెలెక్టెడ్ వేరియంట్స్ పై మాత్రమే తగ్గిన ధరలు
- జిమ్నీ ధర రూ. 10.74 లక్షలతో ప్రారంభం
మారుతి సుజుకి తన మొత్తం మోడల్ రేంజ్ రివైజ్డ్ ధరలను జనవరి 2024 నుండి అమలులోకి తీసుకువచ్చింది. మేము ఇటీవల ధరల అప్డేట్లను పొందాము, అలాగే ఈ కథనంలో, జిమ్నీ ఎస్యువి యొక్క రివైజ్ చేయబడిన వివరాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
జీటా ఏటీ, ఆల్ఫా ఏటీ, మరియు ఆల్ఫా ఏటీ డ్యూయల్-టోన్లతో సహా జిమ్నీ లోని సెలెక్టెడ్ వేరియంట్స్ పై రూ.10,000 వరకు ధర తగ్గింది. అయితే ఎస్యువి లైనప్‌లో ఉన్న అన్ని ఇతర వేరియంట్స్ ధరలలో ఎటువంటి మార్పులు లేవు.
మారుతి జిమ్నీని రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ మోడల్ జీటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.5-లీటర్, K15B పెట్రోల్ ఇంజిన్5 -స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప