- ఇండియాలో ప్రత్యేకంగా తయారు చేయబడిన జిమ్నీ 5-డోర్
- ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రారంభంకానున్న ఎగుమతులు
మారుతి సుజుకి 5-డోర్ జిమ్నీ ఎగుమతులను ప్రారంభించింది. ఈ వాహనాన్ని లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాతో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేసి రవాణా చేయబడుతుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించబడిన, జిమ్నీని తాజా ఇటరేషన్ తో మరొకసారి భారతదేశంలో ప్రత్యేకంగా తయారు చేసారు.
నవంబర్ 2020లో, మారుతి సుజుకి లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికాతో సహా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా 3-డోర్ జిమ్నీ ఉత్పత్తిని ప్రారంభించింది. జూన్ 2023లో, ఇది దేశీయ మార్కెట్ కోసం మరియు 5-డోర్ వెర్షన్ ఎస్‍యువిని లాంచ్ చేసింది, దీని ధర రూ. 12.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభమవుతుంది. మేము న్యూ జిమ్నీని డ్రైవ్ చేసాము, దీనికి సంబంధించిన రివ్యూ మా వెబ్ సైట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ హిసాషి టేకుచి దీని గురించి మాట్లాడుతూ, “జిమ్నీ ఎస్‌యూవి సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బలాన్ని మరింత పెంచిందని, ఈ లైఫ్ స్టైల్ ఎస్‌యూవి చాలా మంది కస్టమర్లను ముఖ్యంగా కఠినమైన రోడ్లపై ఆఫ్-రోడింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఆస్వాదించే కస్టమర్లను మరింతగా ఆకర్షించింది. మా ఎగుమతుల పోర్ట్‌ఫోలియోలో ఉన్న భారతదేశంలో-తయారీ చేసిన జిమ్నీ 5-డోర్ మాతో పాటుగా, మా విదేశీ కస్టమర్లలో ఖచ్చితంగా ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నాం. భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’కు అనుగుణంగా, మా కంపెనీ అన్నీ సెగ్మెంట్లలో 17 వెహికల్స్ వరకు విస్తృత శ్రేణిలో ఎగుమతి చేస్తుంది. భారతదేశంలో తయారీ చేసిన ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులకు కట్టుబడి, దీనిపై కృషి చేస్తూ, మా లీడర్ షిప్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప