- ఆల్ఫా వేరియంట్ పై అత్యధికంగా లభిస్తున్న బెనిఫిట్స్
- రెండు వేరియంట్లలో మారుతి జిమ్నీ లభ్యం
జూన్-2024లో మారుతి సుజుకి జిమ్నీ భారీ డిస్కౌంట్లతో తెరపైకి వచ్చింది. కస్టమర్లు ఈ లైఫ్ స్టైల్ ఎస్యూవీపై ఆఫర్ల రూపంలో రూ. 1.5 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇది ప్రస్తుతం రూ. 12.74 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో జీటా మరియు ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
జీటా వేరియంట్ పై కస్టమర్లు అధికారికంగా రూ. 50,000 వరకు బెనిఫిట్స్ పొందుతుండగా, ఆల్ఫా వేరియంట్ పై రూ.1.5 లక్షల వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్స్ కస్టమర్లకు లభిస్తాయి. ఈ బెనిఫిట్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లు రెండింటిపై స్టాండర్డ్ గా లభిస్తాయి. ఇక్కడ మీకు అందించే మరో టిప్ ఏంటి అంటే, మీ దగ్గర బేరమాడే స్కిల్స్ ఉంటే, తప్పకుండా ఈ కారు ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది.
ఇప్పుడు మరియు గతంలో అనగా 2023 ఏడాది చివరలో కూడా ఆటోమేకర్ భారీ ఆఫర్లను అందించింది. జిమ్నీ లిమిటెడ్ “థండర్” ఎడిషన్ ని కూడా అందుకోగా, సేల్స్ ని మరింత పెంచడానికి జిమ్నీ స్టాండర్డ్ వేరియంట్ భారీ డిస్కౌంట్స్ తో అందించబడింది. సేల్స్ గురించి చెప్పాలంటే, మారుతి కంపెనీ జిమ్నీ కారు లాంచ్ అయినప్పటి నుంచి ప్రతినెలా 250-350 యూనిట్లను విక్రయించింది.
పైన పేర్కొన్న ఆఫర్లు తాత్కాలికం కాగా, ప్రాంతం, స్టాక్ లభ్యత, మరియు డీలర్ షిప్ ని బట్టి మారే అవకాశం ఉంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న మారుతి సుజుకి నెక్సా అధికారిక షోరూంలను సంప్రదించగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్