- ఇండియాలో రూ. 24.82 లక్షలతో ప్రారంభంకానున్న ఇన్విక్టో ధరలు
- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్ మరియు 4 కలర్స్
ఈ సంవత్సరం జూలై నెలలో మారుతి సుజుకి ఇన్విక్టోను రూ. 24.79 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ అధారంగా వచ్చిన ఈ మోడల్ 2 వేరియంట్స్ మరియు 4 కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం, డిసెంబర్-2023 వరకు 5 వేలకు పైగా ఇన్విక్టో ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నట్లు మారుతి వెల్లడించింది. ఇన్విక్టో ఆర్డర్స్ గురించి మరింత ప్రస్తావిస్తూ, ప్రతి నెలా 500-700 యూనిట్స్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. టాప్-స్పెక్ వేరియంట్ అయిన ఆల్ఫా+ టాప్ సెల్లర్ గా కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా, ఇన్విక్టో ఈ ఎంపివి జీటా+ మరియు ఆల్ఫా+ అనే 2 వేరియంట్స్ లో అందించబడుతుంది.
ఇన్విక్టో యొక్క పవర్డ్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి, కారు వీల్స్ కు ఈ-సివిటి యూనిట్ ద్వారా పవర్ ని సప్లై చేస్తుంది. పవర్ అవుట్ పుట్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజిన్ 172bhp మరియు 188Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఎలక్ట్రిక్ మోటారు 11bhp మరియు 206Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్