- రూ.7.29 లక్షలతో వెలాసిటీ ఎడిషన్ ధరలు ప్రారంభం
- 14 వేరియంట్లలో అందించబడుతున్న ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్
మారుతి సుజుకి కంపెనీ వెలాసిటీ ఎడిషన్ ని కేవలం యాక్సెసరీస్ తో మాత్రమే కాకుండా ఇప్పుడు ఫ్రాంక్స్ మోడల్ లోని అన్ని వేరియంట్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చి దీనిని మరింత విస్తరించింది. ఇప్పుడు కస్టమర్లు ఈ మోడల్ ని మొత్తం 14 వేరియంట్లలో యాక్సెసరీస్ ప్యాకేజీతో పొందవచ్చు,
ఫ్రాంక్స్ మోడల్ లోని ముఖ్యమైన వేరియంట్లలో సిగ్మా, డెల్టా, డెల్టా+, డెల్టా+(O), జీటా, మరియు ఆల్ఫా వేరియంట్లు ఉన్నాయి. ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ సిగ్మా వేరియంట్ రూ. 7.209 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కానీ, ఈ ధర కేవలం లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, “బోల్డ్ ఎస్‍యూవీ ఎక్స్‌పీరియన్స్ ని కోరుకునే కస్టమర్‌లకు ఫ్రాంక్స్ ఒక బెస్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కేవలం పది నెలల్లోనే 1,00,000 సేల్స్ తో దిగ్విజయంగా దూసుకెళ్తుంది. ఈ మోడరన్ డిజైన్ తో రూపొందించబడిన ఈ స్పోర్టీ కాంపాక్ట్ ఎస్‍యూవీ పట్ల కస్టమర్ల ప్రేమకు ఈ సేల్స్ నిదర్శనం. ఇప్పుడు ఫ్రాంక్స్ మోడల్ లోని అన్ని వేరియంట్‌లలో వెలాసిటీ ఎడిషన్‌ను అందించడం ద్వారా, మేము ఈ సక్సెస్ ని జరుపుకోవడం మాత్రమే కాకుండా, మా కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్లను అందించడంలో మా కమిట్ మెంట్ ఎంతో ఉంది. ఇప్పుడు కస్టమర్లకు ఫ్రాంక్స్ బెస్ట్ ఆప్షన్ గా మారింది.'
మారుతి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ లోని వేరియంట్-వారీ యాక్సెసరీస్ కింద ఇవ్వబడ్డాయి:
సిగ్మా వెలాసిటీ ఎడిషన్ |
ఫ్రంట్ బంపర్ గార్నిష్ – బ్లాక్ మరియు రెడ్ హెడ్ ల్యాంప్ గార్నిష్ వీల్ ఆర్క్ గార్నిష్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ – ఓపులెంట్ రెడ్ |
డెల్టా, డెల్టా+, మరియు డెల్టా+ (O) వెలాసిటీ ఎడిషన్ |
ఫ్రంట్ బంపర్ గార్నిష్ – బ్లాక్ మరియు రెడ్ హెడ్ ల్యాంప్ గార్నిష్ వీల్ ఆర్క్ గార్నిష్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ – ఓపులెంట్ రెడ్ బాడీ సైడ్ మౌల్డింగ్ – రెడ్ ఇన్సర్ట్స్ రియర్ బంపర్ పెయింటెడ్ గార్నిష్ - బ్లాక్ మరియు రెడ్ ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్ రెడ్ డ్యాష్ డిజైనర్ మ్యాట్ ఎక్స్ టెండెడ్ రియర్ స్పాయిలర్ - బ్లాక్ మరియు రెడ్ డోర్ వైజర్ ఒఆర్‌విఎం కవర్ –రెడ్ రియర్ డోర్ గార్నిష్ |
డెల్టా+, జీటా, మరియు ఆల్ఫా వెలాసిటీ ఎడిషన్ (1.0-లీటర్ వెర్షన్) |
ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ కిట్ – గ్రే మరియు రెడ్ డోర్ వైజర్ ఫ్రంట్ బంపర్ పెయింటెడ్ గార్నిష్ - బ్లాక్ మరియు రెడ్ ఒఆర్‌విఎం కవర్ – రెడ్ హెడ్ ల్యాంప్ గార్నిష్ బాడీ సైడ్ మౌల్డింగ్ – రెడ్ ఇన్సర్ట్స్ రియర్ బంపర్ పెయింటెడ్ గార్నిష్ - బ్లాక్ మరియు రెడ్ ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్ రెడ్ డ్యాష్ డిజైనర్ మ్యాట్ నెక్స్ క్రాస్ సీట్ కవర్స్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ – కార్బన్ ఫినిష్ 3-డీ బూట్ మ్యాట్ ఎక్స్ టెండెడ్ రియర్ స్పాయిలర్ - బ్లాక్ మరియు రెడ్ వీల్ ఆర్క్ గార్నిష్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ – ఓపులెంట్ రెడ్ రియర్ డోర్ గార్నిష్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్