- రూ. 43,000 విలువైన యాక్సెసరీస్ తో అందించబడుతున్న మోడల్
- డెల్టా+, జీటా, మరియు ఆల్ఫా వేరియంట్లలో లభ్యం
ఫ్రాంక్స్ క్రాస్ ఓవర్ యొక్క స్పెషల్ ఎడిషన్‌గా పిలువబడుతున్న వెలాసిటీ ఎడిషన్‌ని మారుతి సుజుకి పరిచయం చేసింది. ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ యాక్సెసరీస్ పరంగా ఈ కొత్త ఎడిషన్ పూర్తి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ తో అందించబడింది. కస్టమర్స్ ఎవరైతే ఫ్రాంక్స్ యొక్క డెల్టా+, జీటా, మరియు ఆల్ఫా వేరియంట్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు రూ. 43,000 విలువైన అదనపు ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
ఫ్రాంక్స్ యొక్క కొత్త వెలాసిటీ ఎడిషన్ మొత్తం 16 యాక్సెసరీస్ తో అందించబడింది. ఇందులో గ్రే మరియు బ్లాక్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ కిట్, డోర్ వైజర్స్, ఓఆర్విఎం కవర్, హెడ్‌ల్యాంప్ గార్నిష్, బాడీ సైడ్ మౌల్డింగ్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్, రెడ్ డ్యాష్ డిజైనర్ మ్యాట్, నెక్స్ క్రాస్ బార్డియక్స్ ఫినిషింగ్ స్లీవ్ సీట్ కవర్, 3డి బూట్ మ్యాట్, స్పాయిలర్ ఎక్స్టెండర్, వీల్ ఆర్చ్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్ గార్నిష్, మరియు కార్బన్ ఫినిష్ తో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ఉన్నాయి.
మెకానికల్ గా, మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఇంతకు ముందు ఇది సెలెక్టెడ్ వేరియంట్లలో కంపెనీ-ఫిట్టెడ్ కిట్ ఆప్షన్ తో కూడా అందించబడింది. ఇక ధరల విషయానికి వస్తే, తాజా మార్పుతో ఫ్రాంక్స్ రూ.7.51 లక్షలు నుండి రూ.13.04 లక్షల వరకు ఆయా వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్