- ఇండియాలో ఏడీఏఎస్(ఎడాస్)సూట్‌ను పొందనున్న మొదటి మారుతి కార్ ఇదే
- గ్రాండ్ విటారాలో కూడా ఏడీఏఎస్(ఎడాస్)ఫీచర్‌ను అందించే అవకాశం
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఈ సారి కొత్త విశేషం ఏంటి అంటే, కార్‌మేకర్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటి హైటెక్ ఫీచర్‌లతో ఫ్రాంక్స్ కారును టెస్ట్ చేస్తుంది. వెబ్‌లో షేర్ చేసిన స్పై షాట్‌లలో ఈ కారు కొంతవరకు కామోఫ్లేజ్ తో కప్పబడి ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, ఫ్రాంక్స్ దాని ఫ్రంట్ గ్రిల్‌పై ఏడీఏఎస్(ఎడాస్)సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ఇండియా-స్పెక్ మోడల్‌లో (లేదు) మిస్ అయ్యింది. మారుతి త్వరలో ఈ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయబోతోందని సంకేతం ఇచ్చింది. దీంతో, టయోటా టైజర్ కి పోటీగా రానున్న ఈ కారు గురించి ఆటోమొబైల్ ప్రియుల్లో చాలా వరకు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.
మారుతి సుజుకి ఇటీవలే జపనీస్ మార్కెట్ లో ఫ్రాంక్స్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మార్కెట్ లో మాత్రమే బాలెనో-బేస్డ్ మోడల్ అయిన ఫ్రాంక్స్ ఏడీఏఎస్(ఎడాస్)సూట్ ని పొందింది. ముఖ్యంగా చెప్పాలంటే, కార్‌మేకర్ ఫ్రాంక్స్ తో పాటుగా గ్రాండ్ విటారాలో కూడా ఈ ఫీచర్‌ను అందించేందుకు దాని పనిని కొనసాగిస్తుంది. గతంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ టెక్నాలజీని ప్రదర్శించింది. మారుతి ఇండియన్ మార్కెట్‌లో విక్రయించే దాని ప్రొడక్ట్స్ లో ఏ ఒక్క దాంట్లో కూడా ఇప్పటి వరకు ఏడీఏఎస్(ఎడాస్)సూట్‌ను అందించలేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప