- ఆయా సెలెక్టెడ్ వేరియంట్లపై పెరగగా, మరికొన్నింటిపై తగ్గిన ధరలు
- తాజాగా మారుతి జిమ్నీపై తగ్గిన ధర
మారుతి సుజుకి కంపెనీ జనవరి-2024లో ఆయా కార్ల ధరలలో మార్పులు చేసింది. ఎంచుకున్న కారు, వేరియంట్, ఇంకా స్పెసిఫికేషన్స్ ని బట్టి వివిధ మోడల్స్ ధరలు తగ్గడంతో పాటు పెరిగాయి. ఇప్పుడు మనం ఫ్రాంక్స్ మోడల్ యొక్క ధరల మార్పులను ఒకసారి పరిశీలిద్దాం.
మారుతి ఫ్రాంక్స్ యొక్క సెలెక్ట్ వేరియంట్స్ అయిన సిగ్మా 1.2 ఎంటి, డెల్టా 1.2 ఎంటి, సిగ్మా 1.2 సిఎన్జి, డెల్టా 1.2 సిఎన్జి, మరియు డెల్టా ప్లస్ 1.2 ఎంటిలపై రూ.5,000 పెరిగింది. అదే విధంగా, జీటా 1.0 టర్బో 6ఎటి, మరియు ఆల్ఫా 1.0 టర్బో 6ఎటిలపై రూ.10,000 తగ్గింది.
ఇప్పుడు ఫ్రాంక్స్ కూపే-ఎస్యూవీ ధర రూ. 7.51 లక్షలు నుండిరూ. 13.13 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉంది. ఈ మోడల్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు సిఎన్జి వెర్షన్లో అందుబాటులో ఉంది. కస్టమర్స్ దీనిని 5-స్పీడ్ మాన్యువల్, ఎజిఎస్, లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ తో ఎంచుకోవచ్చు. ఇతర వార్తలలో చూస్తే, జిమ్నీ యొక్క సెలెక్ట్ వేరియంట్స్ పై రూ.10,000 ధర తగ్గింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్