- ఇండియాలో రూ.7.51 లక్షలతో ప్రారంభమైన ఫ్రాంక్స్ ధరలు
- నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో ఇంజిన్ ఆప్షన్లతో లభ్యం
అరేనా మరియు నెక్సా రేంజ్ లో సెలెక్ట్ చేసిన మారుతి సుజుకి డీలర్‌షిప్‌లు ఈ నెలలో వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ల ను అందిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ ను క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో పొందవచ్చు
మారుతి ఫ్రాంక్స్ దాని టర్బో-టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై, రూ. 60,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అదే విధంగా, ఫిబ్రవరి 2024 నాటికి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్ల పై ప్రస్తుతం ఎలాంటి బెనిఫిట్స్ అందుబాటులో లేవు.
ఫ్రాంక్స్ అనేది బాలెనో-బేస్డ్ కూపే ఎస్యూవీ, దీనిని రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో కొనుగోలు చేయవచ్చు. అవి - 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్, మూడు-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్. మొదటిది 89bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 99bhp మరియు 148Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో ఐదు-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి మరియు ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లు ఉన్నాయి. ఒకవేళ దీనిని మీరు మిస్ అయితే కొంత వరకు నష్టమే అని చెప్పాలి, ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో మారుతి ఫ్రాంక్స్ పై రూ. 10,000 వరకు ధరలు పెంచబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప