- 2023 ఏప్రిల్ లో ఇండియాలో లాంచ్ అయిన మోడల్
- పెట్రోల్ మరియు సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌లతో లభ్యం
మారుతి కంపెనీ ఫ్రాంక్స్ మోడల్ ద్వారా 2 లక్షల కార్లను విక్రయించి రికార్డులను బ్రేక్ చేస్తూ ఉంది. ఫ్రాంక్స్ కారు లాంచ్ అయిన రెండేళ్లలోనే మరో సరికొత్త విక్రయ మైలురాయిని అధిగమించిందని మారుతి పేర్కొంది. ఫ్రాంక్స్ కారు 2024 జనవరిలో 1 లక్ష విక్రయాల ద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సరికొత్త మోడల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత, 2 రెండవ లక్షల కార్ల అమ్మకాల అధిగమించడం ద్వారా ఫ్రాంక్స్ మళ్ళీ దాని సత్తాను చాటింది.
2023 ఏప్రిల్ లో లాంచ్ అయిన ఫ్రాంక్స్, బ్రెజా తో పాటు సబ్-ఫోర్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో ఇది మారుతి నుంచి పోటీలో రెండవకారుగా నిలిచింది. దీనిని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ లేదా 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో పొందవచ్చు, అలాగే, ఇది సిఎన్‌జిపవర్ ఆప్షన్ ని కూడా కలిగి ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో రెండు ఇంజిన్‌లను స్టాండర్డ్ వెర్షన్ లో పొందవచ్చు, అయితే మునుపటిది టూ-పెడల్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 5 –స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని పొందింది. టయోటా టైసర్ వలె ఫ్రాంక్స్ కారు కూడా అదే పవర్‌ట్రెయిన్‌లు మరియు ఫీచర్ లిస్టును పొందింది.
ఈ మైలురాయిపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ, “ఫ్రాంక్స్ అద్భుతమైన విజయం, కస్టమర్ అంచనాలను అభివృద్ధి చేయడంలో మారుతి సుజుకి అవగాహనను మరియు వాటిని మించిన ఉత్పత్తులను అందించడానికి మా ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. 2025లో చెప్పుకోదగ్గ 16 శాతం వృద్ధితో, ఈ కాంపాక్ట్ ఎస్‌యువి మొదటిసారి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది, అదే సమయంలో సెగ్మెంట్‌లో అప్‌గ్రేడ్ చేసే వారికి ప్రధాన ఎంపికగా మారింది.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: రాజపుష్ప