- 2024 – మే రెండవ వారంలో లాంచ్ కానున్న నెక్స్ట్-జనరేషన్ మారుతి స్విఫ్ట్
- వెల్లడైన న్యూ-జెన్ వివరాలు
నేటి కాలంలో కార్ మార్కెట్లో సైజ్ ని మినహాయించి, క్లాస్, మరియు కెపాసిటీని బట్టి అందరూ ఎస్‍యూవీల గురించే చర్చించుకుంటున్నారు. బాడీ స్టైల్స్ పరంగా వేరేవి కూడా ఛాంపియన్ లెవల్ లో ఉన్నా, అందులో మారుతి సుజుకి టాప్ లిస్టులో ఉంటుంది. ఇదే 2024 – మే రెండవ వారంలో ఆల్-న్యూ జనరేషన్ స్విఫ్ట్ గా లాంచ్ కాబోతుంది. ఇది ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఫోర్త్ జనరేషన్ కారు కాగా, మొదటిసారిగా ఇది 2005లో హ్యచ్ బ్యాక్ రూపంలో వచ్చింది.
న్యూ-జెన్ డిజైన్ హైలైట్స్
న్యూ-జెన్ స్విఫ్ట్ ని మీరు చూస్తే, మారుతూ వస్తున్న డిజైన్ తో కొత్త లుక్, వీల్స్, మరియు టెయిల్ ల్యాంప్స్ ని కొత్త జనరేషన్ ద్వారా తీసుకువస్తుంది. ముఖ్యంగా భారీ మార్పులలో ఒకటి ఏంటి అంటే, థర్డ్-జనరేషన్ కారులో ఉన్న పిల్లర్ మౌంటెడ్ డిజైన్ తో పోలిస్తే ఇందులోని రియర్ డోర్ హ్యాండిల్స్ వాటి సాధారణ పొజిషన్ లో ఉంచబడ్డాయి.
ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే, క్యాబిన్ విశాలంగా కనిపిస్తుండగా, ఇందులోని కొత్త టచ్ స్క్రీన్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు స్టాక్డ్ సెంటర్ కన్సోల్ కారును బెస్ట్ లుక్ ని అందిస్తున్నాయి. జపనీస్ మార్కెట్లో న్యూ-జెన్ కారు జర్నీ నవంబర్-2023లో ప్రారంభంకాగా, ఈ కారులో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) మరియు హెడ్-అప్ డిస్ ప్లే (హెచ్‍యూడీ) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇండియన్-స్పెక్ స్విఫ్ట్ ప్యాకేజీగా వస్తున్న కారు ఫీచర్ లిస్టులో 360-డిగ్రీ కెమెరా మరియు హెడ్-అప్ డిస్ ప్లే (హెచ్‍యూడీ) ఉంటాయని భావిస్తున్నాం.
న్యూ-జెన్ ఇంజిన్ ఆప్షన్స్
మారుతి నుంచి వచ్చే 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లకు భారీ మార్కెట్ ఉందని అందరికి తెలిసిన విషయమే. న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్ కూడా ఇదే ఇంజిన్ ని ఇండియన్ మార్కెట్లో కొనసాగిస్తుందని భావిస్తున్నాం. అదే విధంగా, కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండగా, ఇప్పట్లో ఇది ఇండియాకి వచ్చే అవకాశమే లేదని అనుకుంటున్నాం. ఒకవేళ వస్తే, కారు ధర అమాంతం పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది తగిన ధరకు వచ్చే ఛాన్సే లేదు.
ఇది చిన్న ప్రయత్నమా లేదా స్మార్ట్ గా ముందడుగు వేయడమా ?
కొత్త స్విఫ్ట్ ని మనం రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. మొదటిది ఏంటి అంటే, మారుతి చిన్న కార్ల సేల్స్ ఎప్పుడు కూడా పడిపోలేదు, అలాగని పెరగనూ లేదు. కంపెనీ మాత్రం చిన్న కార్లు కొంత మాత్రం మార్కెట్లో పుంజుకున్నా మోడల్ లైన్ లో మంచి లాభాలు ఉంటాయని భావిస్తుంది. వివిధ జనరేషన్ కార్లను వాడుతున్న వారికి ఇవి మంచి సౌకర్యాన్ని అందించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే ఫార్ములాను 19 సంవత్సరాలుగా మారుతి సుజుకి ఉపయోగిస్తుంది.