- 2025 లో లాంచ్ కానున్నమారుతిమొదటి EV కారు
- తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లో eVX ప్రదర్శన
మారుతి సుజుకి ఇండియాలో లాంచ్ అయ్యేందుకు eWX EVపై పేటెంట్ హక్కులు పొందింది. ఇది మొట్ట మొదటిసారిగా 2023 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడింది. జపనీస్ మార్కెట్ కి eWX కాన్సెప్ట్ ఓ వరం అని భావిస్తుండగా, దీనిని ఇండియన్ మార్కెట్ కి కూడా మారుతి సుజుకి పరిచయం చేయనుంది.
అధికారిక హక్కులను పొందిన ఫోటోలను చూస్తే, మారుతి సుజుకి eWX మోడల్గత సంవత్సరం ప్రదర్శించిన కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. ఇది బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, బంపర్‌పై నిలువుగా అమర్చిబడిన లైట్స్, ఏ-పిల్లర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్ మరియు స్క్వేర్డ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఫంకీ వీల్స్‌ను పొందుతుంది. అదే సమయంలో, ఇది బి-పిల్లర్‌లను మిస్ అవుతుంది. ముఖ్యంగా, ఈ కారు రూఫ్ వరకు విస్తరించి ఉన్న విండ్‌షీల్డ్‌ను పొందుతుంది.
ఈ కారు ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉన్నందున, సుజుకి eWXఇంటీరియర్ లేదా టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను ఇంకా వెల్లడించలేదు. ఈ మోడల్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడిన బ్యాటరీ ప్యాక్ ను పొందవచ్చు, అలాగేఇది 230కిమీ వరకు క్లెయిమ్ చేయబడిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
eWX యొక్క మరిన్ని వివరాల కోసం మేము ఎదురుచూస్తున్నాము, మారుతి తన మొదటిఎలక్ట్రిక్ ఆఫర్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియాలో లాంచ్ చేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో eVX ప్రదర్శించబడగా, మారుతి నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్ తర్వాత, టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా EV, హోండా ఎలివేట్ EV మరియు మరిన్నింటికి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప