![ప్రొడక్షన్-స్పెక్ వీల్స్ తో కనిపించిన మారుతి eVX ప్రొడక్షన్-స్పెక్ వీల్స్ తో కనిపించిన మారుతి eVX](https://imgd.aeplcdn.com/642x361/n/cw/ec/180167/maruti-suzuki-evx-right-side-view1.jpeg?isig=0&q=80)
- లాంచ్ తర్వాత క్రెటా ఈవీకి పోటీగా ఉండనున్న eVX
- వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశం
మారుతి సుజుకి దాని మొదటి ఈవీని వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉండగా, మరియు డెవలప్ మెంట్ కి ముందే, కార్‌మేకర్ దేశవ్యాప్తంగా eVXపై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. కొత్త అల్లాయ్ వీల్స్ ప్రొడక్షన్-స్పెక్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు ఉన్న కొత్త స్పై షాట్లు వెల్లడిస్తున్నాయి.
![మారుతి సుజుకి eVX రైట్ సైడ్ వ్యూ Maruti Suzuki eVX Right Side View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, హ్యుందాయ్ క్రెటా ఈవీకి పోటీగా ఉండే, ఈ కారు అల్లాయ్ వీల్ లో కొత్త ఫైవ్-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది సెలెక్ట్ చేసుకున్న వేరియంట్ పై ఆధారపడి బ్లాక్-అవుట్ లేదా డైమండ్-కట్ తో అందించడమే కాకుండా, అదనంగా, మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యువి సైడ్ ప్రొఫైల్ మరియు వీల్ ఆర్చ్‌లపై బ్లాక్ క్లాడింగ్‌ను కూడా పొందుతుంది.
మరోవైపు, 2025 మారుతి eVX ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, సి-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రెష్ సెంటర్ కన్సోల్, డ్రైవ్ మోడ్ల కోసం రోటరీ డయల్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ మరియు మరిన్ని ఫీచర్స్ ను పొందుతుంది.
![మారుతి సుజుకి eVX రైట్ ఫ్రంట్ త్రీ క్వార్టర్ Maruti Suzuki eVX Right Front Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
మారుతి eVX ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేసిన బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుందని అంచనా, రెండోది 55-60kWh కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500కిమీల రేంజ్ ని అందించే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత, ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ మరియు టాటా హారియర్ ఈవీ వంటి వాటికి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప