- ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ని పొందనున్న మారుతి eVX
- బ్లాక్ మరియు బ్రౌన్ సీట్ అప్హోల్స్టరీని కూడా పొందనున్న మోడల్
మారుతి సుజుకి ఇండియాలో 'eVX' అని పిలిచే తన మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ పై పని చేస్తోంది.ఇటీవలి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోతో పాటుగా ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యువి అనేక సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది. దీని తర్వాత, ఈ మోడల్ అనేకసార్లు టెస్టింగ్ ను కొనసాగిస్తూ కనిపించగా,ఇటీవలి స్పై షాట్‌లు రాబోయే (అప్‍కమింగ్) eVX ఎస్‌యువి ఇంటీరియర్ వివరాలను వెల్లడించాయి.
చిత్రంలో కనిపిస్తున్నట్లుగా, మారుతి eVX సాధారణమైన ఎలక్ట్రిక్ వెహికిల్ ట్రేట్స్ ఫ్రీడ్-అప్ స్టోరేజ్ స్పేస్స్ మరియు రూమియర్ క్యాబిన్‌ని పొందుతుంది.ఇది ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ కింద స్టోరేజ్‌తో కూడిన ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, డ్రైవ్ సెలెక్టర్ రోటరీ నాబ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మీడియా కంట్రోల్స్‌తో కూడిన న్యూ డి-కట్ స్టీరింగ్ వీల్ మరియు బ్లాక్ అండ్ బ్రౌన్ సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది.
అంతేకాకుండా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో eVX లోడ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము.
హ్యుందాయ్ క్రెటా ఈవీ, కర్వ్ ఈవీ, మరియు హారియర్ ఈవీల లాంచ్ జరగగా, ఇవన్నీఒకే ఛార్జ్‌పై 500కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందించగలవ ని అంచనా వేస్తున్నాం. అదే విధంగా,మారుతి eVX 60kWh బ్యాటరీ ప్యాక్‌తో పైన పేర్కొన్న ఈవీ కార్ల మాదిరిగానే ఒకే విధమైన డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని మేము భావిస్తున్నాము. ఆటోమేకర్ 2025లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప