- గత నెలలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో అప్‌డేటెడ్ ఈవీఎక్స్ ని ప్రదర్శించిన మారుతి
- 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశం
మారుతి సుజుకి ఇటీవలే భారతదేశంలో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది, దీని లాంచ్ 2025లో జరగనుంది. లాంచ్ కు ముందే మోడల్ కి సంబంధించిన కొత్త స్పై షాట్‌లు లీక్ అవడంతో ఈ మోడల్ కి గురించి కీలకమైన వివరాలను మనం తెలుసుకోబోతున్నాము.
ఇక్కడ స్పై షాట్‌లలో చూసినట్లుగా, మారుతి ఈవీఎక్స్ టెస్ట్ మ్యూల్ ద్వారా బ్లాక్ కామోఫ్లేజ్ తో చుట్టబడింది మరియు అదే సమయంలో,మారుతి ప్రీ-ప్రొడక్షన్ టైల్‌లైట్‌లతో నడుస్తోంది. బయటి నుంచి చూస్తే ఇందులో గన్‌మెటల్ పెయింట్‌తో కూడిన పెద్ద మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్ మరియు వాషర్, నెంబర్ ప్లేట్ రీసెస్‌తో వెనుక బంపర్ మరియు హారిజాంటల్ గా పొజిషన్ చేయబడిన రిఫ్లెక్టర్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, మరియు సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఉన్నాయి.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కొత్త ఈవీఎక్స్ టెస్ట్ కారులోని ఒఆర్‍విఎం లలో కెమెరా కూడా ఉంది, లాంచ్ సమయంలో 360-డిగ్రీ కెమెరా సెటప్ లేకపోయినా ఈ మోడల్‌కు ఇరువైపులా లేన్-వాచ్ కెమెరాలను కలిగి ఉంది.ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్ ఛార్జింగ్ ఫ్లాప్ ని కూడా కలిగి ఉంది.
సుజుకి ఈవీఎక్స్ అప్‌డేట్ వెర్షన్ గత నెలలో టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడింది, వాటి వివరాలు మన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ లోని పవర్డ్ 60kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారు జత చేయబడి ఉంది. అవుట్‌పుట్ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, క్రెటా ఈవీ- మరియు ఎలివేట్ ఈవీలతో పోటీ పడుతున్న ఈ మారుతి మోడల్ ని - ఒకేసారి, పూర్తిగా చార్జ్ చేస్తే 500కి.మీ.ల వరకు వెళ్ళవచ్చని మారుతి కంపెనీ పేర్కొంది.
అనువాదించిన వారు: రాజపుష్ప