- ఇండియాలో 2025 ప్రథమార్థంలో ధరల ప్రకటన
- 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పో ద్వారా ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం
2023 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కారును ప్రదర్శించింది. దీని తర్వాత గత సంవత్సరంలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో దీని అప్ డేటెడ్ ఇటరేషన్ అరంగేట్రం చేసింది. ఇప్పుడు కార్ మేకర్ ప్రొడక్షన్-రెడీ రూపంలో ఉన్న కారు ఎప్పుడు తీసుకువస్తుందో దాని టైంలైన్ వివరాలను కూడా నిర్ధారించింది.
కొత్త ప్రొడక్షన్-స్పెక్ సుజుకి eVX ఎలక్ట్రిక్ కారు ఢిల్లీలో జరగనున్న 2025భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడుతుంది. తర్వాత ఇది యూరోపియన్ మార్కెట్లో మొదట లాంచ్ కానుండగా, దాని తర్వాత ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ రెండూ కూడా 2025ప్రథమార్థంలో జరుగుతాయి.
మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారుగా eVX కారు వస్తుండగా, ఇది మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో ఈ కారు వివిధ బ్రాండ్ల నుంచి వచ్చే హ్యుందాయ్ క్రెటా ఈవీ, మరియు హోండా ఎలివేట్ ఈవీ, అలాగే ఎంజి ZS ఈవీ, మరియు టాటా కర్వ్ ఈవీ వంటి కార్లతో పోటీపడుతుంది.
ప్రస్తుతం 2025 eVXకి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలను మారుతి వెల్లడించకపోయినా, ఈ ఎలక్ట్రిక్ కారు 60kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని భావిస్తున్నాం. ఈ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి కారు ముందు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది. ఈ పవర్ ట్రెయిన్ సింగిల్ ఛార్జ్ పై 550 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని అందించవచ్చు.
ఫీచర్ల పరంగా, కొత్త eVX ఎలక్ట్రిక్ కారు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పెద్ద అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, టూ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, మరియు డ్రైవ్ మోడ్స్ కోసం రోటరీ డయల్ వంటి ఫీచర్లతో రావచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్