- ఆగష్టు 29న లాంచ్ అయిన రూమియన్
- రెండు కార్లలో ఉపయోగించిన 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజిన్
సిఎన్‍జి అనేది చాలా కొత్త పాపులర్ ఫ్యూయల్ గా మారడంతో చాలామంది తయారీదారులు బడ్జెట్ వెహికల్స్ మరియు భారీ రవాణాను చేసే వెహికల్స్ లో దీనిని స్వీకరించడం మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో, మార్కెట్లో మారుతి ఎర్టిగా వెహికిల్ కొంతకాలం నుంచి చాలా పాపులర్ అయి ఫ్లీట్ మార్కెట్‌లో కింగ్ లా నిలిచింది, టయోటా ఈ సంవత్సరం ప్రారంభంలో రూమియన్ ఎంపివిని పరిచయం చేసింది, ఇది ఎర్టిగాకు రీబ్యాడ్జ్ వెర్షన్, మరియు ఇందులో కూడా సిఎన్‍జి వేరియంట్ అందుబాటులో ఉంది. వాటి ఏఆర్ఏఐ సిఎన్‍జిమైలేజీలు ఎలా ఉన్నాయి ? ఎంత మైలేజీ ఇస్తున్నాయి? అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు కార్లులో 1.5-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు, దీని పెట్రోల్ రకం 103bhp/136Nm మరియు సిఎన్‍జి రకం 87bhp/121Nm ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఎంటి రేంజ్ లో స్టాండర్డ్ గా ఉంటుంది, అయితే పెట్రోల్ వెర్షన్ లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఏటీని కూడా పొందుతుంది.
టయోటా రూమియన్ వర్సెస్ మారుతి ఎర్టిగా మైలేజ్
సిఎన్‍జి మైలేజ్ మరియు రేంజ్
మారుతి ఎర్టిగా 26.11కేఎం/కేజిఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజ్ ని కలిగి ఉంది, అయితే టయోటా రూమియన్ 26.11కేఎం/కేజిఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. అంటే, రెండు కార్లలో, కేవలం సిఎన్‍జి పవర్‌తోక్లెయిమ్డ్ 281.9కిమీ రేంజ్ ని పొందవచ్చు.
ఎంటి మరియు ఏటి మైలేజ్ మరియు రేంజ్
వీటి పెట్రోల్ ఎంటి రకాల్లో కూడా, మైలేజ్ ఒకే రకంగా సమానంగా ఉంటుంది, ఈ రెండు కార్లు 20.51 కేఎంపిఎల్ ని ఇస్తుండగా పూర్తి ట్యాంక్ రేంజ్ లో 922కిలోమీటర్స్ డ్రైవ్ చేయవచ్చు. చివరగా, 6-స్పీడ్ ఏటితో, ఎర్టిగా 20.3కేఎంపిఎల్ మరియు రూమియన్ 20.1కేఎంపిఎల్ మైలేజీని కలిగి ఉన్నాయి. 45-లీటర్ ట్యాంక్‌తో, అవి మీకు వరుసగా 913కిలోమీటర్ మరియు 904కిలోమీటర్ రేంజ్ ని అందిస్తాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప