- 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతున్న సిఎన్‍జి మోడల్
- రూ.6.44 లక్షలతో ధరలు ప్రారంభం
మారుతి ప్రస్తుతం సిఎన్‍జి-పవర్డ్ వ్యాగన్ ఆర్ పై 11,000 పెండింగ్ బుకింగ్స్ కలిగి ఉంది. పాపులర్ సిఎన్‍జి మోడల్స్ లో చూస్తే, ఈ నంబర్స్ తక్కువగానే ఉన్నా, 17,000 యూనిట్ల పెండింగ్ బుకింగ్స్ దీని తర్వాత స్థానంలో ఉంది. నిజం చెప్పాలంటే, సిఎన్‍జి రేంజ్ లో తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నా, ప్రతి నెలా ఆటోమేకర్ 16,000 వ్యాగన్ ఆర్ కార్లను సరఫరా చేస్తుందని పేర్కొనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
మొత్తంగా చూస్తే, మారుతి ప్రస్తుతం 2.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, అందులో 1.1 లక్షల సిఎన్‍జి-పవర్డ్ వెహికిల్స్ ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో భారీగా 60,000 యూనిట్లతో ఎర్టిగా నిలిచింది. ఎంపివి వెహికిల్స్ కి డిమాండ్ భారీగా ఉండడంతో తాజాగా ఆటోమేకర్ దాని మానేసర్ ప్లాంట్ వద్ద ప్రొడక్షన్ ని 1 లక్ష యూనిట్ల వరకు విస్తరించింది.
మారుతి నుంచి అందించబడిన సిఎన్‍జి-పవర్డ్ వ్యాగన్ ఆర్ 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి 56bhp/82Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్లు ఉండగా, సిఎన్‍జి ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లుగా ఉంది. ఓవరాల్ గా ఇది 34.05కెఎం/కేజీ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్