- LXi మరియు VXi వేరియంట్‌లలో అందుబాటులో రానున్న బ్రెజా అర్బానో ఎడిషన్
- అదనపు యాక్సెసరీలతో రాబోతున్న బ్రెజా నయా మోడల్
లేటెస్టుగా ఇంటర్నెట్లో లీక్ అయిన డేటా ప్రకారం, మారుతి సుజుకి త్వరలో బ్రెజా స్పెషల్ ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేయనుంది. దీనిని బ్రెజా అర్బానో ఎడిషన్ అని పిలుస్తుండగా,ఇది ఎక్స్‌క్లూజివ్ గా LXi మరియు VXi వేరియంట్‌లతో మాత్రమే అందించబడనుంది.
ముందుగా బ్రెజా అర్బానో ఎడిషన్ LXi వేరియంట్‌తో ప్రారంభిస్తే, ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీకర్లు, ఫాగ్ లైట్లు, ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, బాడీ సైడ్ మౌల్డింగ్, వీల్ ఆర్చ్ కిట్ మరియు గ్రిల్ మరియు ఫాగ్ లైట్లకు గార్నిష్ రూపంలో అదనపు ఫీచర్లతో రానుంది.
అదేవిధంగా, బ్రెజా అర్బానో ఎడిషన్ VXi వేరియంట్ ఫాగ్ లైట్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, 3-డిఫ్లోర్ మ్యాట్స్, నంబర్ ప్లేట్ ఫ్రేమ్స్, మెటల్ సిల్ గార్డ్స్, బాడీ సైడ్ మౌల్డింగ్ మరియు వీల్ ఆర్చ్ కిట్‌తో వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉండనుంది. అదనంగా ఇది అప్‌గ్రేడెడ్ డ్యాష్‌బోర్డ్ తో కూడా అందించబడనుంది, అయితే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
కారు ముందు భాగంలో బానెట్ కింద, కొత్త బ్రెజా అర్బానో ఎడిషన్ ఇంతకు ముందు బ్రెజా ఎడిషన్ లాగే, అదే 1.5-లీటర్, ఫోర్-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్పెట్రోల్ ఇంజిన్ తో రానుండగా, ఈ మోటారు 102bhp మరియు 137Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పెషల్ అర్బానో ఎడిషన్లో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్