- ఇండియాలో రూ. 8.34లక్షలతో ప్రారంభమైన బ్రెజా ధరలు
- సెలెక్ట్ చేసిన వేరియంట్స్ లో సేఫ్టీ ఫీచర్ అప్‌డేట్‌లను పొందిన బ్రెజా
మారుతి సుజుకి దాని కార్లపై ప్రతి నెలా భారీ బుకింగ్‌లను నమోదు చేస్తూనే ఉంది. మే 2024 నాటికి, ఆటోమేకర్ దాదాపు 2.2 లక్షల యూనిట్లను ఇంకా డెలివరీ చేయలేదు, ఇందులో ఎర్టిగా, బ్రెజా, డిజైర్ మరియు వ్యాగన్ R వంటి మోడళ్లు ఉన్నాయి.
అలాగే, మొత్తం 2.2 లక్షల ఓపెన్ బుకింగ్‌లలో, మారుతి బ్రెజాపై ఒక్కటే 20,000 పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంది. ఎర్టిగా- 60,000 ఓపెన్ బుకింగ్‌లతో అత్యధిక బ్యాక్‌లాగ్ ను కలిగి ఉంది. దాని తర్వాత వరుసగా, డిజైర్- 17,000 మరియు వ్యాగన్ R -11,000 పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంది.
మరో వార్తలో చూస్తే, మారుతి ఈ వారంలో కొత్త స్విఫ్ట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ డిజైర్ న్యూ- జెన్ వెర్షన్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా, కంపెనీ దాని మొదటి ఈవీని eVX కాన్సెప్ట్ ఆధారంగా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప