- ప్రస్తుతం రూ.8.34 లక్షలు నుండి ప్రారంభమైన బ్రెజా ధరలు
- పెట్రోల్ మరియు సిఎన్జి పవర్ ట్రెయిన్లతో అందించబడుతున్న బ్రెజా
గత నెలలో, మారుతి సుజుకి కంపెనీ దాని మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, పెరిగిన ధరలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు, మేము బ్రెజా యొక్క అప్డేటెడ్ ధరలను కలిగి ఉన్నాము. మనం బ్రెజా ధరలలో ఉన్న మార్పులను ఒకసారి పరిశీలిద్దాం.
మారుతి బ్రెజా యొక్క ధరలు రూ.10,000 వరకు పెరగగా, ఇవి ZXi, ZXi డ్యూయల్-టోన్, ZXi సిఎన్జి, ZXi సిఎన్జి డ్యూయల్-టోన్, ZXi+, మరియు ZXi+ డ్యూయల్-టోన్ పై వర్తిస్తాయి. అయితే, ఈ కార్ మేకర్ సెలెక్టెడ్ వేరియంట్లు అయిన ZXi AT, ZXi AT డ్యూయల్-టోన్, ZXi+ ఎటి, and ZXi+ ఎటి డ్యూయల్-టోన్ వంటి వాటి ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు.
అదే విధంగా, మారుతి సుజుకి సబ్-4-మీటర్ ఎస్యూవీ యొక్క LXi, LXi సిఎన్జి, VXi, మరియు VXi సిఎన్జి వేరియంట్లపై ఏకరీతిగా రూ.5,000 ధర పెరిగింది. ఏకైక VXi ఎటి వేరియంట్ పై మాత్రం రూ.5,000 ధర తగ్గింది. ప్రస్తుతం బ్రెజా ధరలు బేస్ వేరియంట్ రూ. 8.34 లక్షలు నుండి టాప్ వేరియంట్ రూ. 14.14 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్