- మారుతి కార్లపై భారీగా ఇయర్-ఎండ్ డిస్కౌంట్స్ పొందనున్న కస్టమర్స్
- అతి తక్కువ ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న మారుతి ఆల్టో
కొంతమంది మారుతి సుజుకి డీలర్స్ తమ ఇయర్-ఎండ్ స్కీమ్ లలో భాగంగా భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఓ రకంగా ఇది మారుతి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ బెనిఫిట్స్ నెక్సామరియు ఎరీనాచైన్లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో పొందవచ్చు.
మారుతి ఆల్టో
డిసెంబర్ నెలలో, పెట్రోల్-పవర్డ్ మారుతి ఆల్టోపై మొత్తంగా రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. అందులో రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదే విధంగా, సిఎన్జి వేరియంట్స్ పై రూ. 25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్అందుబాటులో ఉన్నాయి.
ఆల్టోK10 ప్రస్తుతం మారుతి సుజుకి నుండి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు, ప్రస్తుతం దేశంలో ఆర్థికపరంగా ఎవరైనా కొనుగోలు చేయగల కొత్త కారు కూడా ఇదే అని చాలా ఈజీగా చెప్పవచ్చు. ఈ మోడల్ మొత్తం 7 కలర్స్ లో 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, ఇండియాలోదీని ధరలు రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
మారుతి స్విఫ్ట్
మారుతి స్విఫ్ట్ ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకుదానిపై రూ.49,000 వరకుడిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000ఎక్స్చేంజ్ బోనస్, మరియు రూ.4,000 కార్పోరేట్ డిస్కౌంట్ కలిపి ఉన్నాయి.ఇండియాలో మారుతి స్విఫ్ట్ ధరలు రూ.5.99 లక్షల నుండి ప్రారంభంకానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్