- రూ. 17.49 లక్షల నుండి 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తున్న కర్వ్ మోడల్
- 45kWh యూనిట్ మరియు 55 kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కర్వ్ లభ్యం
టాటా మోటార్స్ ఇండియన్ స్పోర్ట్స్ ఐకాన్ షూటర్ మను భాకర్‌కు ఆల్-న్యూ టాటా కర్వ్ ఈవీ (Curvv.EV) కారును బహుమతిగా అందించింది. గత కొన్నేళ్ళుగా అంతర్జాతీయంగా వివిధ ప్రపంచ స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తున్న మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో మెరుగ్గా రాణించి, రజత పతకం సాధించడం ద్వారా భారతదేశ కీర్తిని మరింత పెంచారు. దీనిని పురస్కరించుకుని, టాటా మోటార్స్ మనుకి లేటెస్టుగా లాంచ్ అయిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు కర్వ్.ఈవీని టాటా మోటార్స్ బహుమతిగా అందించింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీధరలు రూ. 17.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 21.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. సిట్రోన్ బసాల్ట్ కారుతో పోటీపడుతున్న ఈ కారు మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుండగా, ఇండియన్ షూటర్ మను భాకర్‌కు ఎంపవర్డ్ ఆక్సైడ్ కలర్ కర్వ్ ఈవీ కారును టాటా కంపెనీ బహుమతిగా ఇచ్చింది.
టాటా కర్వ్ ఈవీ ఎక్స్‌టీరియర్డిజైన్‌లో స్ప్లిట్ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీహెడ్‌లైట్స్, ఎల్ఈడీ లైట్ బార్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు స్లోపింగ్ రూఫ్ వంటివి టాప్ హైలైట్స్ గా చెప్పవచ్చు.
ఇంకా ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, కూపే ఎస్‍యూవీలోపనోరమిక్ సన్‌రూఫ్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్ టెయిల్‌గేట్, వంటి అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో లభిస్తున్న సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఎడాస్ (ఏడీఏఎస్)లెవల్ 2 వంటి వివిధ రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.